Advertisement

సాయి ధరమ్.. జర భద్రం.!

Sun 05th Mar 2017 07:25 PM
sai dharam tej,hit movies,flop movies,tikka movie,winner movie,mega family  సాయి ధరమ్.. జర భద్రం.!
సాయి ధరమ్.. జర భద్రం.!
Advertisement

మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన సుప్రీమ్ హీరో మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్.... ఎంత మెగా కుటుంబం నుండి వచ్చినా సాయి మొదట తన సినిమా కెరీర్ ను గాడిలో పెట్టుకునేందుకు చాలా కష్టాలు ఎదుర్కున్నాడు. అలా సాయి ధరమ్ తేజ్ కీ మొదట్లో సినిమా కష్టాలు తప్పలేదు. వైవిఎస్ చౌదరి దర్శక నిర్మాణంలో మొదలైన సాయి తొలి సినిమా రేయ్.... ఆరంభమై దాదాపు మూడేళ్ళ పాటు ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడిన విషయం తెలిసిందే. చివరికి ఆ సినిమాపై ఆశలు వదులుకున్న సాయి ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాలో హీరోగా చేసి ముందుగా ఈ సినిమానే విడుదల కావడంతో సాయి మెగా ఇమేజ్ వచ్చినట్టయింది. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాలో మెగా మేనల్లుడిని చూసిన అభిమానులు చాలా  ఖుషిగా ఫీలయ్యారు. ఆ నటన, డ్యాన్సులు, ఫైట్లలో మేనమామల మేనరిజమ్ ను చూపించి సాయి బాగానే  అలరించాడు. బాక్సాఫీసు వద్ద కూడా ఈ చిత్రం మంచి ఫలితాన్నే రాబట్టింది. ఆ తర్వాత రేయ్ కూడా విడుదలైంది. బాక్సాఫీసు వద్ద దారుణంగా దెబ్బతిన్నది. అయితే ఇదే కానీ సాయి మొదటి సినిమాగా విడుదలై ఉంటే సాయి సినిమా కెరీర్ పై అమితంగా ప్రభావం చూపి ఉండేది. ఈ సినిమా విడుదల ఆలస్యం కావడంతో ఒక రకంగా సాయికి మంచి జరిగిందనే చెప్పాలి.

ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సాయి ధరమ్ చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సెల్..... కథ పరంగా ఏమాత్రం కొత్తధనం లేని ఈ చిత్రంలో కొత్త ట్రీట్ మెంట్, దిల్ రాజు గ్రాండ్ పబ్లిసిటీతో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ బ్రహ్మాండంగా సేల్ అయిన విషయం తెలిసిందే. ఇంకా ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సుప్రీమ్’ సినిమా కూడా  కమర్షియల్ గా విజయం అందుకుంది. ఈ చిత్ర విజయంతో సాయి మార్కెట్ లో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత విడుదలైన ‘తిక్క’  చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తాపడింది. దీంతో అభిమానులంతా ఒక్కసారిగా నిరుత్సాహ పడ్డారు. ముందు తీసుకున్న అడ్వాన్స్ కారణంగా సాయి ధరమ్ గుడ్డిగా ఒప్పేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ‘విన్నర్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మళ్ళీ సాయి ధరమ్ అభిమానులను అమితంగా నిరాశ పరచింది. ఈ చిత్రం కథలో ఎలాంటి కొత్తదనం చూపించపోగా రొటీన్ విధానాన్ని చేపట్టి విసిగించినట్లుగా అయింది. బాక్సాఫీసు వద్ద కూడా ఘోరంగా చతికిల పడింది. కాగా ఇప్పుడు వరుసగా రెండు ప్లాప్ లు రావడంతో సాయి ధరమ్ ఇప్పటికైనా జర భద్రంగా కథల ఎంపిక, దర్శకుల ఎంపిక విషయంలో నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలే సాయి ఓ సినిమా చేస్తున్నప్పుడు వరుసగా మూడు నాలుగు సినిమాలకు అడ్వాన్సులు తీసుకొని ఇదే ధోరణిలో.... ఒకే మూస పద్ధతిలో కథాకథనం ఉండటం వంటివి చేస్తే ఇలానే బోల్తాకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇప్పటికైనా సాయి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement