Advertisement

ఏకగ్రీవమైన చినబాబు ఎమ్మెల్సీ ఎంపిక!

Tue 28th Feb 2017 11:23 AM
  ఏకగ్రీవమైన చినబాబు ఎమ్మెల్సీ ఎంపిక!
ఏకగ్రీవమైన చినబాబు ఎమ్మెల్సీ ఎంపిక!
Advertisement

తెదేపాలోకి వారసుడు చినబాబును ఏదో విధంగా తీసుకొచ్చి అధికారికంగా మంచి బాధ్యతలను అప్పగించాలని చంద్రబాబు చూస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం నుండి ఆ తతంగం లోలోపల నలుగుతున్న ఇప్పటివరకు ఫైనల్ గా నిర్ణయం తీసుకోకపోవడం తెలిసిందే. అయితే తాజాగా, అదీ హడావుడిగా, అందులోనూ ప్రత్యేకంగా చినబాబు కోసమే అన్నట్టు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కేవలం ఈ సమావేశం జరిపింది ఎందుకంటే.. చినబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు అందరికీ ఓకే కదా..! అని అనిపించేందుకు మాత్రమే నిర్వహించినట్లు తెలుస్తుంది.

ప్రత్యేకంగా ఈరోజు చంద్రబాబు నివాసంలో జరిగిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో కుమారుడు లోకేశ్ ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పార్టీ పొలిట్ బ్యూరో ఏకగ్రీవంగా ఎంపిక చేసింది కూడాను. ఈ సందర్భంగా మిగతా ఎమ్మెల్సీ స్థానాలకు కూడా అభ్యర్ధుల ఎంపికను పొలిట్ బ్యూరో చంద్రబాబుకే వదిలేసినట్లు తెలుస్తుంది. ఇంకా ఇదే సమావేశంలో రాష్ట్ర విభజన సందర్భంగా  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఒత్తిడి తేవాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కేంద్రప్రభుత్వం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను ఒకేసారి జరపాలన్న నిర్ణయానికి అనుకూలంగా పొలిట్ బ్యూట్ సమావేశం మద్దతు తెలిపింది. కాగా అమరావతిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనానికి సంబంధించిన ప్రారంభోత్సవం ముహూర్తం కూడా ఖరారు అయింది. మార్చి 2 ఉదయం 11.25కు అమరావతిలో అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికి  లోకేశ్ బాబును ఎమ్మెల్సీగా పంపించాలని మాత్రం పొలిట్ బ్యూరో గట్టిగా తీర్మానించుకుందన్నమాట. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement