Advertisement

నటీమణులకు ఈ కష్టాలు ఇంకా ఎంత కాలం?

Thu 23rd Feb 2017 03:50 PM
celebrities,bhavana,heroines,problems  నటీమణులకు ఈ కష్టాలు ఇంకా ఎంత కాలం?
నటీమణులకు ఈ కష్టాలు ఇంకా ఎంత కాలం?
Advertisement

బుల్లితెర నుండి వెండితెర వరకు నటీమణులు కనిపించాలంటే లైంగిక వేధింపులకు సిద్దపడిపోవాలనేది బహిరంగ రహస్యం. ఎవరికైనా ఆడవారికి ఛాన్స్‌లు ఇవ్వాలంటే లైంగికంగా అన్నింటికీ రెడీ అనాలి. అందుకే చాలామందికి అందం, అభినయం అన్నీ ఉన్నా కూడా దానికి ఒప్పుకోకపోతే అదోపాతాళమే. అందుకే ఎందరో తెరమరుగైపోయారు.. మరెందరో ఈ పరిశ్రమకు రావడానికి భయపడుతున్నారు. ఇక్కడ అందరినీ తప్పుపట్టలేం. కానీ అధికశాతం మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు అదే కోవకి చెందుతారు. డబ్బులను ఏ రియల్‌ఎస్టేట్‌లోనో, ఏ కబ్జాలలోనో, ఏదో ఒక ఫీల్డ్‌లో బాగా సంపాదించి, దానిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక, సినిమా ఫీల్డ్‌ అయితే పేరుకు పేరు, సుఖానికి సుఖం, ఎంజాయ్‌లైఫ్‌ ఉంటుందని ఈ పరిశ్రమకు వస్తున్న వారి సంఖ్య అధికం కావడం శోచనీయం. నటి భావన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. కానీ ఇది ఇప్పుడు కాదు.. ఎప్పటి నుంచో ఉంది. కానీ పెద్దగా మీడియా విస్తరించని పరిస్థితుల్లో, ఉన్న కొద్దిపాటి మీడియాను కూడా బేరం చేయగలిగిన బడాబాబులు, వారికి లొంగే జర్నలిస్ట్‌లు ఉండబట్టే.. ఈ విషయాలు ఇంతకాలం పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ నేడు మీడియా మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియాలో స్వేచ్చ లభిస్తుండటంతో ఇవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నాటి సావిత్రి నుంచి నిన్నటి సిల్క్‌స్మిత వరకు, కంగనా రౌనత్‌ నుంచి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ వరకు ఇవి జరుగుతూనే ఉన్నాయి. పక్కలేసే వారు, ఛాన్స్‌లు ఇప్పిస్తామని బ్రోకరైజ్‌ చేసే మధ్యవర్తులు ఇండస్ట్రీలో రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ ఉన్న వారికి కూడా ఈ వేధింపులు తప్పడం లేదు. అందుకే ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వారి వారసులను పరిచయం చేయడానికి ఆసక్తి చూపిస్తారే గానీ వారసురాళ్లను పరిచయం చేయాలంటే భయపడుతుంటారు. వారసురాళ్లకు కూడా ఈ వేధింపులు ఒకానొక సమయంలో తప్పదు. బాలీవుడ్‌, కోలీవుడ్‌లో పెరుగుతున్న పలు సినీ ఫ్యామిలీల వారసురాళ్లది కూడా ఇదే పరిస్థితి. ఇక ఇక్కడ సామాన్య ప్రజలను కూడా మనం తప్పుపట్టాలి. ఉదాహరణకు ఏదైనా పట్టణానికి, లేదా ఇతర ఊర్లకు షాప్‌ ఓపెనింగ్స్‌ నుండి అనేక కార్యక్రమాలకు హాజరయ్యే లేడీ సెలబ్రిటీల విషయంలో సామాన్య ప్రజలు, అభిమానులు ప్రవర్తించే తీరు చాలా అసభ్యంగా ఉంటోంది. ఎవరైనా సినీ తార ఫలానా షాప్‌ ఓపెనింగ్‌కు వస్తుందని ప్రచారం చేసుకుని, లబ్దిపొంది, అలా ఫంక్షన్లకు హాజరయ్యే వారికి భారీ రెమ్యూనరేషన్లు కూడా ఇచ్చే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు లేడీ సెలబ్రిటీల రక్షణ విషయంలో సరిగా చర్యలు తీసుకోరు. దీంతో అభిమానుల కోలాహలం, తోపులాటలు జరుగుతాయి. ఇదే అవకాశంగా భావించే కొందరు మృగాళ్లు మహిళలను తాకరాని చోట తాకడం, ఎక్కడెక్కడో చేతులు వేయడం చూస్తూనే ఉన్నాం.. ఇది ఓ డర్టీ పిక్చర్‌లా అనిపించినా ఇవి చేదువాస్తవాలే. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement