Advertisement

ఫేక్‌ కలెక్షన్స్‌లో మనకంటే వారే ఘనులంట..!

Wed 15th Feb 2017 06:00 PM
tollywood,kollywood,bollywood,shahrukh khan,hrithik roshan,raees,kaabil,rajinikanth  ఫేక్‌ కలెక్షన్స్‌లో మనకంటే వారే ఘనులంట..!
ఫేక్‌ కలెక్షన్స్‌లో మనకంటే వారే ఘనులంట..!
Advertisement

సినిమాల కలెక్షన్లను ఎక్కువ చేసి చూపడం అనేది ఒక్క టాలీవుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా అన్నిభాషల్లో జరుగుతోందనేది వాస్తవమేనని సినీ పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి థియేటర్ల సంఖ్యలో గానీ, ఇతర కలెక్షన్ల విషయంలో గానీ కోలీవుడ్‌ కంటే మనమే ముందున్నామని చాలా మంది వాదిస్తున్నారు. కానీ తమిళ ప్రజలు మలేషియా, గల్ఫ్‌లతో పాటు పలు దేశాలలో ఉన్నందున అవి అక్కడ కూడా విడుదలవుతున్నాయని, కానీ వాటి కలెక్షన్లు మనతో పోల్చుకుంటే చాలా తక్కువని విశ్లేషిస్తున్నారు. రజనీకాంత్‌ నటించిన 'కబాలి' చిత్రం తమిళం తప్ప అన్ని చోట్లా ఫ్లాప్‌ అని, కానీ నిర్మాతలు మాత్రం తెలుగులో తప్ప అన్ని భాషల్లో ఘనవిజయం సాధించిందని, ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా 500కోట్లకు పైగా వసూలు చేసిందని చెబుతున్న వార్తలు అబద్దమని, అది అక్కడి పరిశ్రమ ప్రముఖులతో పాటు అక్కడి మీడియా చేస్తోన్న గ్లోబెల్స్‌ ప్రచారమని వాదిస్తున్నారు. 

రజనీతో పాటు కమల్‌, సూర్య వంటి అనేక మందికి తమిళంతోపాటు తెలుగు వంటి భాషల్లో కూడా క్రేజ్‌ ఉన్నప్పటికీ వారి స్టార్స్‌ చేసిన చిత్రాలు మొదటి రెండు రోజుల్లోనే 100కోట్లు వసూలు చేయడమనేది నిజం కాదని, వారు తమ చిత్రాల బడ్డెట్‌ను ఎక్కువ చేసి చూపించి, తెలుగులోని ఇతర భాషల్లోని అనుభవం లేని నిర్మాతలకు భారీ మొత్తానికి అనువాద హక్కులను, రీమేక్‌ రైట్స్‌ను అమ్ముకుంటున్నారనే విమర్శలు కూడా ఎప్పటి నుండో ఉన్నాయి. మలయాళం, కన్నడ.. ఇలా అన్ని పరిశ్రమలలోనూ ఇలాగే ఫేక్‌ కలెక్షన్లు రాజ్యమేలుతున్నాయంటున్నారు. ఇంతకాలం కేవలం బాలీవుడ్‌లోని వారే నిజాయితీగా కలెక్షన్లు చెప్పేవారని అందరూ భావించారని, కానీ ఇప్పుడు అక్కడ షార్‌ఖ్‌తో పాటు హృతిక్‌ వంటి వారు కూడా కలెక్షన్లను పెంచి చెబుతున్నారంటూ, దానికి ఇటీవల విడుదలైన షార్‌ఖ్‌ 'రాయిస్‌'ను, హృతిక్‌ 'కాబిల్‌'ను తాజా ఉదాహరణలుగా లెక్కలతో సహా చూపుతున్నారు. అంతా చిత్రవిచిత్ర మాయ అనే చెప్పాలి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement