Advertisement

కేటీఆర్‌ వ్యవహారశైలి మాత్రం బాగాలేదు..!

Thu 02nd Feb 2017 02:50 PM
ktr,pawan kalyan,nagarjuna,samantha,kcr  కేటీఆర్‌ వ్యవహారశైలి మాత్రం బాగాలేదు..!
కేటీఆర్‌ వ్యవహారశైలి మాత్రం బాగాలేదు..!
Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమారుడు, కాబోయే సీఎంగా వార్తల్లో నానుతున్న మంత్రి కేటీఆర్‌ తన పనితీరుతో, మాటల చాతుర్యంతో భేష్‌ అనిపించుకుంటున్నాడు. కాగా ఆయన మొదటగా రాష్ట్రంలోని చేనేత కార్మికుల దుస్థితిని గమనించి, చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని, ఇకపై తాను చేనేత బట్టలనే ధరిస్తానని తెలిపాడు. ఆ వెంటనే పవన్‌ కూడా ఆయన పిలుపుకు స్పందించాడు. తనను కలిసిన చేనేత కార్మికులకు ఆయన తన అండదండలు ఉంటాయని, ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని కూడా ఆదుకుంటానని చెప్పి, రెండు తెలుగు రాష్ట్రాలలో చేనేత వస్త్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేయడానికి ముందుకు వచ్చాడు. 

కానీ దీనికి కనీసం కేటీఆర్‌ కృతజ్ఞతలు కూడా తెలపలేదు. ఏపీలోని రాజకీయనాయకులది కూడా అదే పరిస్థితి. కాగా ఇప్పుడు కేసీఆర్‌కు, కేటీఆర్‌కు సన్నిహితునిగా ఉన్న నాగార్జున తన కాబోయే కోడలు సమంతను కేవలం తెలంగాణ చేనేతసహకార సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండేందుకు ఒప్పించాడు. దీంతో కేటీఆర్‌ సమంతను ఆహ్వానించి,కృతజ్ఞతలు తెలిపి, ఆమెకు పోచంపల్లి చీరను బహుమతిగా ఇచ్చాడు. సమంత చేసింది మంచిపనే, ఇందులో నాగ్‌ని కూడా ప్రశంసించాలి. కానీ సమంత కేవలం తెలంగాణకు మాత్రమే బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. మరి ఆమెకు, నాగ్‌కు బిగ్‌ఫాలోయింగ్‌ ఉన్న ఏపీలో కూడా ఆమె చేనేత పరిశ్రమకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండటానికి ఎందుకు అంగీరించలేదు? అనేది అసలు ప్రశ్న. 

రెండు రాష్ట్రాలకే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఆమె బ్రాండ్‌అంబాసిడర్‌గా నిలిచినా సంతోషమే. కానీ ఆమె ఏపీని పట్టించుకోలేదు. ఇద్దరు కాదు.. ఎందరు బ్రాండ్‌ అంబాసిడర్లైనా ఉండవచ్చు. అందులో తప్పుగానీ, పోటీ గానీ లేదు. మరి సమంత, నాగ్‌ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? కేటీఆర్‌ కనీసం పవన్‌కు ప్రత్యక్షంగా కాకపోయిన, మీడియాతోనైనా ఎందుకు కృతజ్ఞతలు ప్రకటించలేదు? అనేది చర్చనీయాంశమే. చాలా మందికి ఇది సిల్లీగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. మన తెలుగు వారందరం అన్నదమ్ములం. వారిని ఇంకా విడగొట్టి విద్వేషాలు రెచ్చగొట్ట వద్దు. అదే సమయంలో పవన్‌ కూడా కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా, తనకు మంచి అభిమానులు ఉన్న కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాలలో కూడా చేనేత వస్త్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటే మంచిది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement