Advertisement

దిల్‌రాజు మాటలకు అర్ధాలే వేరులే..!

Fri 20th Jan 2017 12:49 PM
dil raju,heroes,nani,raviteja  దిల్‌రాజు మాటలకు అర్ధాలే వేరులే..!
దిల్‌రాజు మాటలకు అర్ధాలే వేరులే..!
Advertisement

నిర్మాతగా, పంపిణీదారునిగా దిల్‌రాజుకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తాజాగా ఆయన చిరు, బాలయ్య వంటి ఇద్దరు కొదమసింహాలు బరిలో దిగుతున్నప్పుడే తాను శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ వంటి వారితో సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో నిర్మించిన 'శతమానం భవతి' చిత్రం కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో దానిని పోటీలోకి దించి భారీ లాభాల దిశగా పయనిస్తున్నాడు. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన క్లీన్‌ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కావడంతో ఈచిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే గాక ఓవర్‌సీస్‌లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇక దిల్‌రాజు ఏ పనిచేసినా, చివరకు ఏ మాట మాట్లాడినా కూడా దాని వెనుక ఓ కాలిక్యులేషన్‌ ఉంటుంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు రాజ్యమేలుతున్న కాలం తెలుగు పరిశ్రమకు గోల్డెన్‌డేస్‌గా నిలిచాయన్నారు. ఇక ఆ తర్వాత ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగి తనకు తానే సాటి అని నిరూపించున్నాడని, ఆ తర్వాత ఎవరి అండదండలు లేకుండా ఇండస్ట్రీలో స్టార్స్‌ స్థాయికి చేరుకుంది కేవలం రవితేజ, నానిలేనని కితాబునిచ్చాడు. 

కాగా 'శతమానం భవతి' ప్రమోషన్‌లో అనసరంగా దిల్‌రాజు ఈ టాపిక్‌పై మాట్లాడటం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. దిల్‌రాజు మాటల్లో వాస్తవం ఉన్నప్పటికీ ఇప్పుడు మరలా ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా? అని కొందరు మండిపడుతున్నారు. కానీ దిల్‌రాజు మాట్లాడే ప్రతి మాట వెనుక ఎన్నో కాలిక్యులేషన్స్‌ ఉంటాయని కొందరు ఈ వ్యాఖ్యలను విశ్లేషిస్తున్నారు. ఆమధ్య ఆయన రామ్‌చరణ్‌ను తగ్గించి, బన్నీని ఆకాశానికి ఎత్తుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కేవలం దిల్‌రాజు బన్నీతో 'డిజె' చిత్రం చేస్తుండటమే దానికి కారణం అనే విమర్శలు వచ్చాయి. తాజాగా కూడా ఆయన నానితో 'నేనులోకల్‌' చేసి, విడుదలకు సిద్దం చేస్తున్నాడు. ఇక రవితేజతో అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. దాంతో రవితేజ,నానిల పేర్లను మరలా ఇండస్ట్రీలో పది మంది మాట్లాడుకునేలా చేసేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడంటున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement