Advertisement

బాలయ్య మరోసారి తన గొప్పతనం చాటాడు!

Tue 17th Jan 2017 05:49 PM
gautamiputra satakarni,balakrishna,no story,krish  బాలయ్య మరోసారి తన గొప్పతనం చాటాడు!
బాలయ్య మరోసారి తన గొప్పతనం చాటాడు!
Advertisement

నందమూరి బాలకృష్ణ ఏది చేసినా నిక్కచ్చిగా, ఏది చెప్పినా ముక్కుసూటిగా ఉంటుందని ఆయన సన్నిహితులు, అభిమానులు చెబుతుంటారు. కాగా బాలయ్యకు లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు చెప్పే అలవాటు కూడా లేదంటుంటారు. బాలయ్య నటించిన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు క్రిష్‌ను, శాతకర్ణిగా నటించిన బాలయ్య యాక్టింగ్‌ను అందరూ ప్రశంసలతో ముంచేస్తున్నారు. ఈ చిత్రం తెలుగుజాతి ఖ్యాతిని దశదిశలా చాటిందనే ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ చిత్రం బాగా ఉన్నప్పటికీ కథ విషయంలో ఏదో తెలియని లోపం ఉందని, శాతకర్ణి జాతిని ఏకం చేయడానికి చేసిన యుద్దాలే తప్ప సినిమాలో బలంగా చెప్పుకునే పాయింట్‌ ఏమీ లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో బాలయ్య మరోసారి తన వ్యక్తిత్వం చాటుకున్నాడు. 

ఆయన మాట్లాడుతూ, 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంలో కథాపరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. శాతకర్ణి జీవితానికి సంబందించిన చారిత్రక ఆధారాలు పెద్దగా లేవు. దాంతో మాకు లభించిన కొద్దిపాటి సమాచారంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కానీ ఆ లోటును కనిపించకుండా డైరెక్టర్‌ క్రిష్‌ అద్భుతంగా తీశారు.. అని వాస్తవాన్ని ఒప్పుకున్నారు. కాగా ఇప్పుడు ఈ చిత్రంపై మరో వివాదం మొదలైంది. ప్రముఖ చరిత్రకారుడు, రాయల్‌ హిస్టారికల్‌ సొసైటీ లండన్‌ సభ్యుడు, వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ నాయకుడు కెప్టెన్‌ ఎన్‌.పాండురంగారెడ్డి ఈ చిత్రంతో చరిత్రను తప్పుదారి పట్టించారని ఆరోపిస్తున్నాడు. శాతకర్ణి కోటిలింగాలలో పుట్టలేదని, ఆయన తల్లి గౌతమీ ఆనవాళ్లు మహారాష్ట్రలో ఉన్నాయంటున్నాడు. ఇక శాతకర్ణి కుమారుడు పులోమావి విధిలేని పరిస్థితుల్లో మాత్రమే అమరావతికి వచ్చాడంటున్నాడు. ఇక సినిమాలో చూపించనట్లుగా ఆయన కాలంలో గుర్రపు జీనులు వాడే సాంప్రదాయం లేదని, కాబట్టి ఈ విషయంలో దర్శకుడు క్రిష్‌ క్షమాపణ కోరాలని డిమాండ్‌ చేస్తూ, ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇచ్చిన వినోదపు పన్ను మినహాయింపును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాడు. మరి ఈవిషయంలో శాతకర్ణి యూనిట్‌ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సివుంది....! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement