Advertisement

హీరోల ఫ్యాన్స్‌ మధ్య కామెంట్ల యుద్దం..!

Mon 16th Jan 2017 10:49 PM
balakrishna fans,chiranjeevi fans,comments war,khaidi no 150,gautamiputra satakarni  హీరోల ఫ్యాన్స్‌ మధ్య కామెంట్ల యుద్దం..!
హీరోల ఫ్యాన్స్‌ మధ్య కామెంట్ల యుద్దం..!
Advertisement

చిరు నటించిన 150వ చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150 ', బాలయ్య 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలు రెండు.. ఒకరోజు గ్యాప్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా చిరు చిత్రం ఒక రోజు ముందుగా విడుదల కావడంతో ఆ చిత్రానికి మొదటిరోజు తిరుగేలేకుండా పోయింది. ఎక్కువ థియేటర్స్‌ కూడా లభించాయి. కానీ ఆ తర్వాత రోజు విడుదలైన బాలయ్య చిత్రానికి చిరు చిత్రం మూలంగా కావాల్సినన్ని థియేటర్లు దొరకలేదన్నది మాత్రం వాస్తవం. కానీ 'గౌతమీపుత్ర' చిత్రానికి 'ఖైదీ' చిత్రం కంటే మంచి టాక్‌ వచ్చింది. దీంతో లాంగ్‌రన్‌లో మాత్రం బాలయ్య చిత్రమే ఘనవిజయం సాధించేలా కనిపిస్తోందని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే తమ తమ చిత్రాల కలెక్షన్స్‌ విషయంలో మాత్రం చిరు, బాలయ్య అభిమానుల మధ్య చిన్నపాటి యుద్దమే జరుగుతోంది. ముఖ్యంగా సోషల్‌మీడియాలో వారు ఒకరి చిత్రాలను మరొకరు దుమ్మెత్తిపోస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. సంక్రాంతి రోజున ఓ ప్రముఖ పీఆర్వో ఈ రెండు చిత్రాల కలెక్షన్లను పోలుస్తూ ఓ ట్వీట్‌ పెట్టాడు. అందులో ఆయన 'ఖైదీ' చిత్రం కంటే 'గౌతమీపుత్ర..' చిత్రం మంచి కలెక్షన్ సాధిస్తోందంటూ లెక్కలు వివరించాడు. ఇప్పుడు ఆ ట్వీట్‌ సంచలనాలకు వేదికగా మారింది. ఈ ట్వీట్‌ నందమూరి అభిమానులకు ఓ ఆయుధంగా దొరికింది.

కానీ ఆ వెంటనే ఆ పీఆర్వో తన ట్వీట్‌ను డిలేట్‌ చేశాడు. మరి ఇది ఎందువల్ల చేశాడో? ఆయనపై ఎవరి నుంచి ఒత్తిడి వచ్చిందో అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. కానీ మెగాభిమానులు మాత్రం అవి ఆ పీఆర్వో చేసిన ట్వీట్‌ కాదని, ఎవరో హ్యాక్‌ చేశారని వాదిస్తున్నారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం ఈ విషయంలో ఓ ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌ చిత్రాల రేంజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన 'బాహుబలి' చిత్రం రికార్డులను 'ఖైదీ...' తిరగరాసిందని అల్లు అరవింద్‌ చెప్పిన మాటలను మాత్రం వారు అసలు నమ్మడం లేదనేది వాస్తవం. అలాగే ఓవర్‌సీస్‌లో కూడా ఈ చిత్రానికి విడుదలకు ముందు 25డాలర్లకు టిక్కెట్లు అమ్మిన మాట వాస్తవమేనని, కానీ చిత్రం విడుదలైన తర్వాత మాత్రం ఏకంగా 23 డాలర్లు డిస్కౌంట్‌ ఇచ్చి కేవలం 2డాలర్లకే టిక్కెట్లు అమ్మారని అంటున్నారు. ఆయా డిస్కౌంట్‌ టిక్కెట్లను కూడా సాక్ష్యంగా చూపిస్తున్నారు. ఇలా ఒకరంటే మరొకరు గొప్పంటూ...తెగ హడావుడి చేస్తూ..సినిమాల యూనిట్ కంటే ఎక్కువగా..సినిమాలకు ప్రమోషన్ చేస్తున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement