ఆమె సుడి తిరిగింది..!

Sat 14th Jan 2017 12:49 AM
ఆమె సుడి తిరిగింది..!

స్టార్‌హీరోల చిత్రాలలో నటించిందా? అంటే లేదు. పోనీ చాలా చిత్రాలలో నటించిందా? అంటే అదీ లేదు. కేవలం నానితో చేసిన 'మజ్ను' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మరో కేరళ కుట్టి అను ఎమ్మాన్యువల్‌. 'మజ్ను' చిత్రం పెద్ద హిట్‌ కాకపోయినా ఈమె అమాయకపు మోము, సోయకళ్లు పలువురిని ఆకర్షించాయి. దాంతో అతి తక్కువకాలంలోనే ఈ అమ్మడు కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. కోలీవుడ్‌లో కూడా బిజీగా మారుతోంది. ప్రస్తుతం తెలుగులో ఆమె రాజ్‌తరుణ్‌తో 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', గోపీచంద్‌తో 'ఆక్సిజన్‌' చిత్రాలలో నటిస్తోంది. ఇక తమిళంలో కూడా ఆమె యాక్షన్‌హీరోగా తమిళ, తెలుగు భాషల్లో గుర్తింపు ఉన్న విశాల్‌ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఆమెకు స్టార్‌ విక్రమ్‌ హీరోగా, హీరోయిన్లను అందంగా ప్రజెంట్‌ చేయడంలో సిద్దహస్తుడైన గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో రూపొందనున్న 'ధృవ నక్షత్రం' చిత్రంలో అవకాశం వచ్చింది. ఇక తెలుగులో ఆమెకు పవన్‌-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో కూడా సెకండ్‌ హీరోయిన్‌గా అవకాశం వచ్చిందని అంటున్నారు. మరి ఇవ్వన్నీ నిజమై, విడుదలైతే మాత్రం ఆమె మరో కేరళకుట్టి కీర్తిసురేష్‌కు, టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్‌లో ఉన్న రకుల్‌ వంటి వారికి గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. 

Latest

Note: Please DO NOT use ABUSIVE language in comments.

Latest

Popular in Times

Contact us    Privacy     © 2017