ఇద్దరు తమ మనసు మార్చుకున్నారంట..!

Sat 14th Jan 2017 12:37 AM
ఇద్దరు తమ మనసు మార్చుకున్నారంట..!

సినిమా వారి వైవాహిక జీవితాలు ఎక్కువకాలం నిలవవని అంటుంటారు. ఇందులో వాస్తవం కూడా ఉంది. రాజమౌళి 'ఈగ, బాహుబలి' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన కన్నడస్టార్‌ కిచ్చా సుదీప్‌ వైవాహిక జీవితం కూడా ఈ మద్య కన్నడనాట హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన మలయాళీ అయిన ప్రియా రాధాకృష్ణన్‌తో ప్రేమాయణం సాగించి, ఆ తర్వాత కొంతకాలం సహజీవనం కూడా చేసి, ఎట్టకేలకు 2001లో వివాహం చేసుకున్నాడు. వీరికి 9ఏళ్ల పాప కూడా ఉంది. అయితే సుదీర్ఘ వైవాహిక జీవితంలో వారి మద్య గొడవలు వచ్చాయి. మామూలు కుటుంబం నుంచి వచ్చిన ప్రియాకు తన భర్తపై వస్తున్న రూమర్లు, అమ్మాయిలలో ఉన్న క్రేజ్‌ వంటి వాటి మూలంగా అనుమానాలు మొదలవ్వడమే దీనికి కారణం అనే వార్తలు వచ్చాయి. కాగా పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులకు రెడీ అయిపోయారు. తన భార్యకు దాదాపు 20కోట్ల పరిహారంతో పాటు తన బిడ్డ మైనర్‌ కావడంతో ఆ పాప బాధ్యతలను కూడా ఆమెకే అప్పగించాలని సుదీప్‌ డిసైడ్‌ అయ్యాడు. ఇక విడాకులకు సంబంధించిన తంతులన్నీ పూర్తై కొద్దిరోజుల్లో అధికారికంగా డైవర్స్‌ వచ్చే సమయంలో ఇద్దరు తమ మనసు మార్చుకున్నారు. గత కొంతకాలంగా విడివిడిగా ఉంటోన్న వీరిద్దరూ మరలా కలిసి ఉండాలని నిర్ణయించడంతో ఇరు కుటుంబసభ్యులే గాక సుదీప్‌ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Latest

Note: Please DO NOT use ABUSIVE language in comments.

Latest

Popular in Times

Contact us    Privacy     © 2017