అందరి చేతా వావ్‌.. అనిపిస్తోంది..!

Fri 13th Jan 2017 05:05 AM
అందరి చేతా వావ్‌.. అనిపిస్తోంది..!

కొత్త దర్శకుడైన సంకల్ప్‌ దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా హిందీ, తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానున్న చిత్రం 'ఘాజీ'. సబ్‌మెరైన్‌నేపథ్యంలో వాస్తవిక సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలై అందరి చేతా వావ్‌.. అనిపిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను చూస్తే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు మరో విజువల్‌ వండర్‌గా థ్రిల్‌ కలిగిస్తుందని అర్ధమవుతోంది. ఇది ఓ కొత్త దర్శకుడు తీసిన విధంగా కాకుండా ఎంతో అనుభవం ఉన్నవారు తీసిన విధంగా అనిపించకమానదు. రానా, తాప్సి, అతుల్‌కులకర్ణి, నాజర్‌, ప్రకాష్‌రాజ్‌ ... వంటి వారితో పాటు ఇటీవల మరణించిన ఓంపురి కూడా కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ అర్జున్‌ వర్మగా ట్రైలర్‌లోనే రానా దుమ్మురేపాడని చెప్పాలి. ఈ చిత్రాన్ని ఎంతో భారీ వ్యయంతో పివిపి, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు తెరకెక్కిస్తున్నాయని జస్ట్‌ ఈ ట్రైలర్‌ను చూస్తేనే అర్దమవుతోంది. మొత్తానికి దీనితో విభిన్న చిత్రాల ప్రేక్షకుల, అభిరుచి కలిగిన వారి టేస్ట్‌కు, ముఖ్యంగా మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌ను, ఏ సెంటర్‌ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టే విధంగా ఈ తాజా ట్రైలర్‌ ఉండటంతో ఫిబ్రవరి 17న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రంపై రానానే కాదు.. ప్రేక్షకులు కూడా బాగానే ఆశలుపెట్టుకున్నారని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని హిందీలో కరణ్‌జోహార్‌ రిలీజ్‌ చేస్తుండటంతో అక్కడ కూడా ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. 

Latest

Note: Please DO NOT use ABUSIVE language in comments.

Latest

Popular in Times

Contact us    Privacy     © 2016