అదిరింది...గురూ...!

Fri 13th Jan 2017 02:45 AM
అదిరింది...గురూ...!

తెలుగులో రీమేక్‌ల రారాజు ఎవరంటే ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్‌ని చెప్పుకోవాలి. ఆయన కెరీర్‌లో చాలా మంచి విజయాలు రీమేక్‌లు అందించినవే కావడం విశేషం. 'సీతమ్మ.. మసాలా, గోపాలా.., దృశ్యం' వంటి చిత్రాలను చూస్తే ఆయన తన ఏజ్‌కు తగ్గ పాత్రలపైనే దృష్టిపెట్టిన విషయం, ఆయనకు మారిన మైండ్‌సెట్‌ అర్థమవుతాయి. ఇటీవల ఆయన మారుతి దర్శకత్వంలో చేసిన 'బాబు బంగారం' చిత్రం ఆయన కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడ లేదనే చెప్పాలి.ప్రస్తుతం ఆయన 'సాలాఖద్దూస్‌' మూవీని అదే దర్శకురాలు సుధాకొంగర దర్శకత్వంలో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఆల్‌రెడీ ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌తో మిడిల్‌ ఏజ్‌డ్‌ బాక్సింగ్‌ కోచ్‌గా, గడ్డంతో రఫ్‌గా, ఎగ్రెసివ్‌గా కనిపిస్తున్న ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. 

కానీ మొదటి టీజర్‌లో మాత్రం ఆయన కాస్త విభిన్నంగా డ్యాన్స్‌ మూమెంట్స్‌ చేశాడు. ఈ చిత్రం తాజా టీజర్‌ విడుదలైంది. ఇందులో ఆయన 'బాక్సింగే నా ప్రపంచం... సున్నితంగా ట్రై చేస్తే నీలాగా వాళ్లూ జీవితాంతం మరుగుదొడ్లు డుక్కుంటూ ఛస్తారు.. మీరు నేను చెప్పిందే వింటారు. చెప్పిందే తింటారు. ఇల్లు, వాకిలి, ప్రేమ, దోమ వంటి చెత్తాచెదారం అన్ని పక్కనపెట్టి, ఒళ్లోంచి ట్రై చేయండి.. అంటూ గంభీరంగా చెప్పిన డైలాగుల ప్రొమో, కఠినంగా కనిపిస్తున్న ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా బాగున్నాయి. హిందీలో శిష్యురాలిగా నటించిన రితికా సింగ్‌కు నేషనల్‌ ఆవార్డు వచ్చింది. అదే పాత్రను ఆమె తెలుగులో కూడా చేస్తుండటం విశేషం. మొత్తానికి తనకి అచ్చివచ్చిన రీమేక్‌ మంత్రం 'గురు'కు కూడా కలిసొస్తుందా? లేదా? అనేవి వేచిచూడాల్సివుంది. ఇక ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ జనవరి26 నుంచి ఏకంగా సమ్మర్‌కు వెళ్లిపోవడం ఆయన అభిమానులకు కాస్త నిరాశనే మిగులుస్తోంది. ఈ చిత్రం సెమీ రీమేక్‌ కావడమే ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు ఏర్పడపోవడానికి కారణం అంటున్నారు. మరి బాక్సాఫీస్‌ వద్ద వెంకీ నమ్మే విభిన్న పాత్రల మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందో లేదో చూద్దాం.

Latest

Note: Please DO NOT use ABUSIVE language in comments.

Latest

Popular in Times

Contact us    Privacy     © 2016