ఇంకా నోరు విప్పని చైతూ..!

Thu 12th Jan 2017 03:06 PM
akkineni nagarjuna,naga chaitanya,samantha,evv sathyanarayana,omkar direction,rajugaari gadhi 2 movie  ఇంకా నోరు విప్పని చైతూ..!
ఇంకా నోరు విప్పని చైతూ..!

కింగ్‌ నాగార్జున కెరీర్‌లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'హలో బ్రదర్‌' ఓ మైలురాయి. ఈ చిత్రం మ్యూజికల్‌గా కూడా పెద్ద విజయం సాధించింది. గతంలో ఇదే చిత్రాన్ని ఆయన కుమారుడు నాగచైతన్యతో రీమేక్‌ చేయాలని భావించినా అది నెరవేరలేదు. ప్రస్తుతం నాగచైతన్య తన తండ్రికి మొదటి చిత్రంతోనే 'సోగ్గాడే...' తోబ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ బేనర్‌పై ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో టాప్‌హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో 'హలోబ్రదర్‌'లోని సూపర్‌హిట్‌ సాంగ్‌ 'ప్రియరాగాలే.... ' చిత్రాన్ని రీమిక్స్‌ చేయాలనే ఆలోచనలో దర్శకహీరోలతో పాటు సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్‌ ఉన్నారని వార్తలు వస్తున్నా.. ఈ విషయంలో చైతు ఇంకా పెదవి విప్పలేదు. మరోపక్క ఆయన కాబోయే భార్య సమంత 'మహానటి' చిత్రంలో ఓ జర్నలిస్ట్‌ పాత్రను చేయనుందని, అలాగే నాగ్‌ హీరోగా ఓంకార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజుగారి గది2'లో కూడా ఓ కీలకపాత్రలో నటించనుందనే వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై ఎవరైనా అఫీషియల్‌గా స్పందించే వరకు ఈ వార్తలను నిర్ధారించలేమని అంటున్నారు. 

Latest

Latest

Popular in Times

Contact us    Privacy     © 2017