రంభకు సమన్లు అందజేసిన పోలీసులు..!

Thu 12th Jan 2017 02:58 PM
rambha,police,case on rambha,old actress rambha in troubles  రంభకు సమన్లు అందజేసిన పోలీసులు..!
రంభకు సమన్లు అందజేసిన పోలీసులు..!

మాజీ గ్లామర్ తార రంభ ఎంతో ఆనందంగా హైదరాబాద్ వచ్చింది. ఆమె రాకకోసం చూస్తున్న పోలీసులు మాత్రం సమన్లతో రెడీగా ఉన్నారు. ఒక ప్రయివేట్ ఈవెంట్ కోసం చెన్నై నుండి వచ్చిన నటి రంభకు హైదరాబాద్ పోలీసులు సమన్లు అందజేశారు. తొలుత అవాక్కైనప్పటికీ వాటిని స్వీకరించక తప్పలేదు. రంభకు సమన్లు ఇవ్వడమేమిటని ఆశ్చర్యపోవద్దు. దీని వెనుక కొంత ఫ్లాష్ బ్యాక్ ఉంది. రంభ సోదరుడు శ్రీనివాసరావు భార్య పల్లవి గతంలో కేసు పెట్టింది. అదనపు కట్నం కోసం వేదిస్తున్నారనేది ఆమె ఆరోపణ. కేసు కుటుంబ సభ్యులందరిపై నమోదు అయింది. ఇందులో రంభ కూడా ఉంది. దీనికి సంబంధించి రంభ మినహా అందరికీ సమన్లు జారీ అయ్యాయి. రంభ అమెరికాలో సెటిల్ కావడంతో సమన్లు అందలేదు.  ఈ క్రమంలో ఒక  ప్రయివేట్ ఛానల్ కార్యక్రమం కోసం రంభ తరచుగా హైదరాబాద్ వస్తున్నారని సమాచారం ఉండడంతో ఆమెను కలిసి సమన్లు జారీ చేశారు. 

ఇక రంభ విషయానికి వస్తే ఆమె అమెరికా నుండి తిరిగి వచ్చి చెన్నైలో సెటిలైందని తెలిసింది. భర్తతో విభేదాలు కారణమని అంటున్నారు. భర్తతో విడిపోనుందని ప్రచారం జరుగుతోంది. 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017