వార్నింగ్‌ పేరుతో పవన్‌పైనే సెటైరా..?

Fri 13th Jan 2017 12:57 AM
వార్నింగ్‌ పేరుతో పవన్‌పైనే సెటైరా..?

మోహన్‌బాబుకు చిరు కన్నా నడివేదికలో తన విమర్శలకు ధీటుగా పవన్‌ స్పందించడాన్ని ఆయన ఎప్పటికీ మరిచిపోయేలా లేడు. తాజాగా తన పెద్ద కుమారుడు మంచు విష్ణును ఉద్దేశించిన 'లక్కున్నోడు' ఆడియో వేడుకలో మోహన్‌బాబు చేసిన హెచ్చరిక కేవలం పవన్‌ను టార్గెట్‌ చేసిందేనని టాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు ఈ చిత్రం ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, విష్ణు నీకో హెచ్చరిక చేస్తున్నాను. ఇట్స్‌ ఎ వార్నింగ్‌. నువ్వు టీవీల్లో మాట్లాడటం విన్నాను. నేను సామాన్యంగా నా ఆడియో వేడుకలకు కూడా పెద్దగా హాజరుకానని అన్నావు. భార్యాబిడ్డలు ఉన్న వాడివి. పది మంది సమక్షంలో చెబుతున్నాను. నువ్వు అలా మాట్లాడటం తప్పు. నీ సినిమా ఆడియో వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు నువ్వు హాజరుకావాలి, అంతేకాదు.. ఇతర హీరోల చిత్రాల వేడుకలకు కూడా నువ్వు హాజరుకావాలి. ప్రేమతో పిలిచినప్పుడు వెళ్లాలి. అంతేగానీ కొందరిలాగా నేను ఎక్కడికి హాజరుకాను అని డబ్బాలు కొట్టవద్దు. 

మనకు డబ్బాలు ముఖ్యం కాదు... అనే వ్యాఖ్యలను మోహన్‌బాబు మరోసారి విష్ణుకు వార్నింగ్‌ పేరుతో పవన్‌పై సెటైర్‌ వేశాడంటున్నారు. మరోపక్క ఆయన కూతురు మరో వింత నిర్ణయం తీసుకుంది. తనను వయసులో చిన్నవాళ్లు అక్కా అని పిలిచినా తప్పులేదని, కానీ నాకంటే పెద్దవాళ్లు, పళ్లూడిపోయిన ముసలివారు కూడా నన్ను అక్కా... అని పిలుస్తున్నారు. కాబట్టి వళ్లు మండిపోతోంది.దాంతో నాపేరును అక్కా అని మార్చుకోవాలని ఉంది. అక్క లేదుతొక్కాలేదు...అంటూ వెటకారంగా అంది.'అక్కా.. అని తనని పిలవడం ఆమెకు వెటకారమో?లేక నిజమో? అర్దం కావడం లేదని కొందరు సెటైర్లు వేస్తుంటే మరి కొందరు మరి దాసరిని వయసులో పెద్దవారు కూడా గురువు గారు అని, స్వర్గీయ ఎన్టీఆర్‌ను ఆయనకంటే పెద్దవారు కూడా 'అన్నా...' అని పిలిచేవారని, మరీ దాసరికి, స్వర్గీయ ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానినని చెప్పుకునే మోహన్‌బాబు ఈ విషయంలో తన కూతురును ఎందుకు మందలించలేదో తెలియడం లేదని కొందరు ఆయనపై, ఆయన కూతురుపై సెటైర్లు వేస్తున్నారు. 

Latest

Note: Please DO NOT use ABUSIVE language in comments.

Latest

Popular in Times

Contact us    Privacy     © 2016