బాలయ్య కూడా అదరగొడుతున్నాడట..!

Fri 13th Jan 2017 12:52 AM
బాలయ్య కూడా అదరగొడుతున్నాడట..!

రేపు బాలయ్య వందో చిత్రం 'గౌతమీపుత్ర....' విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ప్రీమియర్‌షోను ప్రత్యేకంగా ప్రముఖుల కోసం అమరావతిలో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని టిడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బాలయ్య అల్లుడు నారా లోకేష్‌తో పాటు ఆయన భార్య, బాలయ్య గారాల కూతురు బ్రాహ్మణి కూడా చూశారు. ఈ సందర్భంగా లోకేష్‌ 'తనకు ఈ చిత్రం ద్వారా గౌతమీపుత్ర శాతకర్ణి' జీవితాన్ని తెలుసుకునే అదృష్టం లభించిందన్నాడు. బాలయ్య నటన చూసి తాను సంభ్రమార్చర్యాలకు లోనైనానని, ఈ చిత్రంలోని ఇతర నటీనటులు కూడా అద్భుతంగా నటించారని, ముఖ్యంగా దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించాడని కొనియాడాడు. ఇక బ్రాహ్మణి మాట్లాడుతూ, ఈ చిత్రం చూసిన తర్వాత నోట మాటరావడం లేదన్నారు.తన తండ్రి బాలయ్య నటనతో అదరగొట్టాడని ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్‌ అత్యద్భుతం తెరకెక్కించాడని ఆమె కొనియాడారు. అయితే కాకి పిల్ల కాకికి ముద్దు కాబట్టి.. చిరు 'ఖైదీ...' చిత్రంపై ఫ్యాన్స్‌ నుండి వస్తున్న టాక్‌తో పాటు బాలయ్య 'గౌతమీపుత్ర..' విషయాన్ని కూడా కేవలం లోకేష్‌, బ్రాహ్మణిల పొగడ్తలతో నమ్మలేమని, మరో రెండు రోజులు ఎదురుచూస్తేగానీ ఎవరి చిత్రం బాగుందనేది తెలియదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది నిజమే.. కేవలం ఫ్యాన్స్‌, కుటుంబసభ్యులు మాత్రమే చూసే మొదటి రోజు, రెండో రోజు టాక్‌ను పరిగణనలోకి తీసుకోవడం సమంజసం కాదనే చెప్పాలి. 

Latest

Note: Please DO NOT use ABUSIVE language in comments.

Latest

Popular in Times

Contact us    Privacy     © 2016