దాసరి... కరణ్‌జోహార్‌లు రాస్తున్న ఆత్మకథలు..!

Thu 12th Jan 2017 11:53 PM
దాసరి... కరణ్‌జోహార్‌లు రాస్తున్న ఆత్మకథలు..!

భారత దేశ సినీ చరిత్రలో ఇప్పటికే ఎందరో మహానుభాహులు తమ స్వీయ చరిత్రలను రాశారు. ఇక తెలుగు విషయానికి వస్తే స్వర్గీయ సీనియర్‌ నిర్మాత, నటుడు మల్లెమాల 'ఎం.ఎస్‌.రెడ్డి' రాసిన ఆత్మకథ, నిర్మాత మురారి రాసిన పుస్తకాలు పలు వివాదాలకు కేంద్ర బిందువులయ్యాయి. మరీ ముఖ్యంగా తాను బతికివుండగా కూడా నిర్మోహమాటంగా మాట్లాడే ముక్కుసూటి వ్యక్తి ఎం.ఎస్‌.రెడ్డి రాసిన ఆత్మకథలో ఆయన ఎన్నోవాస్తవాలను రాశారు. తాను పనిచేసిన స్వర్గీయ ఎన్టీఆర్‌ నుండి రాజశేఖర్‌ వరకు ఎందరో హీరోలను తనదైన శైలిలో ఉతికి ఆరేశాడు. దాంతో కొందరు పనిగట్టుకొని మరీ ఆయన ఆత్మకథను బ్యాన్‌ చేసే దాకా పరిస్థితి వెళ్లింది. ప్రజాస్వామ్యం, వాక్‌స్వాతంత్య్రం గొప్పగా ఉన్నాయని భావించే మన దేశంలో వాస్తవ పరిస్థితులు వేరని, ఈ పుస్తకం బ్యాన్‌ విషయంలో కొందరు పెద్దలు అనుసరించిన వైఖరి దీనికి ఉదాహరణ అనేది కొందరికి తీవ్ర ఆవేదన కలిగించిన విషయం. 

కాగా త్వరలో మరో దిగ్గజం, అందరూ గురువుగా భావించే దర్శకరత్న దాసరి సైతం తాను కూడా తన బయోగ్రఫీని రాస్తున్నానని, మరి కొంత సమయంలో ఈ పుస్తకం పూర్తి చేస్తానన్నాడు.ఇక దాసరి కూడా పరిశ్రమలో ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్రబిందువేనన్న సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో అందరూ మహానుభావులుగా భావించే కొందరు వ్యక్తుల అసలు జీవితాలను బహిర్గతం చేస్తానని దాసరి ప్రకటించడంతో ఇప్పుడే టాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇక మరో బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ కూడా త్వరలో తన స్వీయ చరిత్రను రాయనున్నాడు.ఇప్పటికే ఆయన హోమోసెక్స్‌వల్‌ అన్న విషయాన్ని పలుసార్లు ఇన్‌డైరెక్ట్‌గా తెలిపాడు. ఇక ఆయన మాట్లాడుతూ, తన లైంగిక విషయాలను ప్రకటిస్తే ఇండియాలో తనను అరెస్ట్‌ చేస్తారని, మరి మనదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని విరుచుకుపడ్డాడు. మరోపక్క షారుఖ్‌తో మీకు సెక్స్‌ సంబంధాలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు ఎవరైనా సోదరుడితో ఆ పనిచేస్తారా? అని ప్రశ్నించాడు. మరి త్వరలో విడుదలయ్యే దాసరి, కరణ్‌జోహార్‌ల ఆత్మకథలు మరెన్ని సంచలనాలకు వేదికగా నిలుస్తాయో వేచిచూడాల్సివుంది. 

Latest

Note: Please DO NOT use ABUSIVE language in comments.

Latest

Popular in Times

Contact us    Privacy     © 2016