చిరు, బాలయ్య ల తర్వాత వెంకీ, నాగ్..!

Wed 11th Jan 2017 04:31 PM
guru,venkatesh,chiranjeevi,balakrishna,nagarjuna,om namo venkatesaya  చిరు, బాలయ్య ల తర్వాత వెంకీ, నాగ్..!
చిరు, బాలయ్య ల తర్వాత వెంకీ, నాగ్..!

ఈ ఏడాది మొదటి రెండునెలల్లోనే మన సీనియర్‌ స్టార్స్‌ నలుగురు థియేటర్లలోకి రానుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఈరోజు(బుధవారం) చిరు 'ఖైదీ...' చిత్రం రిలీజ్‌ కాగా, రేపు బాలయ్య 'గౌతమీపుత్ర...' గా రానున్నాడు. ఇక ఆల్‌రెడీ కింగ్‌ నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో వస్తున్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' ఆడియోకు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలకు రెడీ అవుతోంది. ఇక మిగిలిందల్లా విక్టరీ వెంకటేష్‌ మాత్రమే. ఈయన నటిస్తున్న 'గురు' చిత్రం ఫస్ట్‌లుక్‌తోపాటు ఆల్‌రెడీ టీజర్‌ విడుదలైంది. వీటికి మంచి రెస్పాన్స్‌ లభించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను నేడు(బుధవారం) సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఈరోజు నుండి 'ఖైదీ.. ' థియేటర్లలో, 13 నుండి బాలయ్య 'గౌతమీపుత్ర....' థియేటర్లలో ప్రదర్శిస్తారు. మరి బాలయ్య చిత్రం రిలీజ్‌ బాధ్యతను తీసుకున్న వెంకీ సోదరుడు డి.సురేష్‌బాబు 'గురు' చిత్ర ట్రైలర్‌ను 12వ తేదీ నుంచే బాలయ్య థియేటర్లలో ప్రదర్శించకుండా, ఒక రోజు ఆలస్యంగా 'గౌతమీపుత్ర...' చిత్ర థియేటర్లలో ప్రదర్శించడం వెనుక కారణం ఏమిటో అర్దంకాని విషయం. ఈ చిత్రంలో పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో ఆడియో విషయంలో ఇంకా ఎటూ తేల్చుకోలేదు. 'సాలాఖద్దూస్‌'కు రీమేక్‌గా వస్తున్న ఈమూవీని ఒరిజినల్‌ వెర్షన్‌ దర్శకురాలు సుధాకొంగరనే దర్శకత్వం చేస్తుండగా, రితికాసింగ్‌ కీలకపాత్రను పోషించింది. ఈ చిత్రాన్ని రిపబ్లిక్‌ డే కానుకగా జనవరి26న రిలీజ్‌ చేయనున్నారు. మరి ఇదే తేదీని కన్‌ఫర్మ్‌ చేస్తారో, లేక ఓ వారం వాయిదా వేస్తారో? అని చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈ చిత్రంతో వెంకీ మరో విభిన్నపాత్రలో అలరించనున్నాడు. 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017