జయసుధకు 70 లక్షలు నిజమా..కాదా..?

Wed 11th Jan 2017 03:21 PM
jayasudha,constable venkatramaiah,jayasudha remuneration,r narayana murthy,chadalavada  జయసుధకు 70 లక్షలు నిజమా..కాదా..?
జయసుధకు 70 లక్షలు నిజమా..కాదా..?

సహజనటి జయసుధ తన కెరీర్ లో అత్యధిక పారితోషికం తీసుకుంది. నాయికగా ఏనాడు పది లక్షల పారితోషికం తీసుకోని ఈ నటి క్యారెక్టర్ నటిగా మాత్రం 70 లక్షలు డిమాండ్ చేసీ మరీ తీసుకుందని అంటున్నారు. ఆమెకు ఇంతటి భారీ ఆఫర్ ఇవ్వడానికి కారణం విప్లవ నటుడు ఆర్. నారాయణమూర్తి సరసన నటించడమే అని తెలిసింది. సంక్రాంతికి విడుదలవుతున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రంలో జయసుధ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్స్ తో నటించిన జయసుధ తన స్థాయి తగ్గించుకుని ఆర్. నారాయణమూర్తి కాంబినేషన్ లో చేయడానికి అంగీకరించింది. అయితే ఇందుకోసం 70 లక్షల పారితోషికం డిమాండ్ చేసిందట. కమర్షియల్ మార్కెట్ కోసం ఆమె అడిగినంత ఇవ్వడానికి దర్శక, నిర్మాత చదలవాడ అంగీకరించారు. హెడ్ కానిస్టేబుల్.. సినిమాకు ఈ మాత్రం క్రేజ్ రావడానికి జయసుధ నటించడమే కారణం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఇదిలా ఉంటే..నిర్మాత, దర్శకుడు అయిన చదలవాడ..ఈ సినిమాకి కేవలం 26 లక్షలు మాత్రమే జయసుధ కి ఇచ్చాడని, అతను చాలా పిసినారి..అని, డబ్బుల విషయంలో..అతను అస్సలు ఎవర్ని లెక్కచేయడని..జయసుధ తరుపునుండి వినిపిస్తుంది. 

Latest

Latest

Popular in Times

Contact us    Privacy     © 2017