మెగా ఎంట్రీ మెగా హీరోలకు ఊపు..!

Thu 12th Jan 2017 01:03 AM
మెగా ఎంట్రీ మెగా హీరోలకు ఊపు..!

సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఖైదీ నంబర్ 150 చిత్రానికి వారు భారీ స్వాగతం పలుకుతున్నారు. చిరంజీవి చరిష్మా ఏ మాత్రం తగ్గలేదని ఓపనింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఆయన కమర్షియల్ విజయం సాధిస్తారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంత విరామం మరే స్టార్ హీరో తీసుకోలేదు. అయినప్పటికీ ఆదరణలో మాత్రం తేడా లేదని వారు అంటున్నారు. 

ఇకపోతే చిరంజీవి మళ్లీ రావడం అభిమానులకు ఎలాంటి ఉత్సాహం ఉందో, అదే విధంగా ఇతర మెగా హీరోలకు భరోసా కూడా ఏర్పడింది. అల్లు అర్జున్ మినహా మిగతా మెగా హీరోలు పవన్ కల్యాణ్ సహా చరణ్, సాయిధరమ్, వరుణ్ తేజ్ ఫ్లాప్ ల పరంపర ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఓపెన్ కాంపిటేషన్ లో వీరంతా వెనుకపడ్డారనేది అందరికీ తెలిసిన విషయమే. చిరంజీవి కార్డు ఉపయోగించుకుంటూ రాణిస్తున్న ఈ హీరోలు కథల ఎంపికలో మాత్రం తప్పటడుగు వేస్తున్నారు. దాంతో విజయాలు దూరమయ్యాయి. వీరందరికీ ఇప్పుడు చిరంజీవి ఎంట్రీ మంచి ఊతం ఇస్తుందని అనుకోవచ్చు. చిరంజీవి నామస్మరణ మెగా కాంపౌండ్ హీరోలకు కొత్త శక్తిని ఇస్తుంది. కుటుంబ పెద్ద ఫామ్ లో ఉంటే అది అందరికీ ధైర్యంగా ఉంటుందని సినీ విశ్లేషకులు  భావిస్తున్నారు. 

Latest

Note: Please DO NOT use ABUSIVE language in comments.

Latest

Popular in Times

Contact us    Privacy     © 2017