Advertisement

అనుకున్నది సాధించేలా కనిపిస్తున్నాడు..!

Wed 11th Jan 2017 11:57 AM
daggubati rana hero,ghazi movie,sekhar kammula,krish,puri  అనుకున్నది సాధించేలా కనిపిస్తున్నాడు..!
అనుకున్నది సాధించేలా కనిపిస్తున్నాడు..!
Advertisement

దగ్గుబాటి రానా 'లీడర్‌' వంటి మంచి చిత్రంతో హీరోగా పరిచయమైనప్పటికీ ఆయనకు ఆ చిత్రం పెద్దగా కలిసి రాలేదు. శేఖర్‌కమ్ములతో పాటు పూరీ, క్రిష్‌ వంటి దర్శకులు సైతం ఆయనకు సోలోహిట్టును అందించలేకపోయారు. ప్రస్తుతం ఆయన నమ్మకమంతా కొత్త దర్శకుడైన సంకల్ప్‌రెడ్డిపైనే ఉంది. నేడు అద్బుతాలు సృష్టిస్తున్న కొత్త దర్శకులలాగానే సంకల్ప్‌ సైతం తనకు బ్రేకిస్తాడని ఎంతో ఆశగా రానా ఉన్నాడు. 1971 ఇండో-పాక్‌ యుద్దంలో వైజాగ్‌ను నాశనం చేయాలని వచ్చిన పాక్‌ సబ్‌మెరైన్‌ 'ఘాజీ'ని మన వావికాదళ అధికారులు ఎంత వీరోచితంగా పోరాడి దానిని నాశనం చేశారనే వాస్తవగాథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రానా నావికాదళ అధికారిగా కనిపిస్తున్నాడు. 

ఈ మధ్య బయోపిక్‌ మూవీస్‌కి బాగా ఆదరణ లభిస్తున్న సమయంలో ఇలాంటి కథను ఎంచుకొని రానా చాలా ముందు చూపుతో వ్యవహరించాడనే ప్రశంసలు లభిస్తున్నాయి. దీంతో పాటు చిత్రంలోని ఎక్కువ సన్నివేశాలను అండర్‌వాటర్‌లో తీయడంతో ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇస్తుందనే ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని, పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలను స్పీడ్‌గా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణసంస్థలైన పివిపి, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. వీరు గతంలో నిర్మించిన చిన్న చిత్రమైన 'క్షణం' అద్బుతవిజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్ర నిర్మాణం వెనుక రానా తండ్రి డి.సురేష్‌బాబు అనుభవం, సహకారం, ఆర్దికతోడ్పాటు కూడా ఉండటంతో ఈ సినిమా మంచి అంచనాలను రేకెత్తిస్తోంది. 

కాగా ఈ చిత్రం ఒకేసారి హిందీ, తెలుగుభాషల్లో రూపొందుతోంది. దీని ట్రైలర్‌ని త్వరలో విడుదల చేయనున్నారు. గతంలో రానాకు, సురేష్‌బాబుకు బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ ఫ్యామిలీతో మంచి పరిచయం ఉంది. బాలయ్య 'రైతు' చిత్రంలో ఓ అతిథి పాత్రలో నటించడానికి తిరస్కరించిన అమితాబ్‌ 'ఘాజీ' చిత్రాన్ని ప్రమోట్‌ చేయడానికి మాత్రం ముందుకు రావడం ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయింది. ఈ విషయంలో బాలయ్య చేయలేని పనిని రానా సాధించాడని అంటున్నారు. అమితాబ్‌ ఈ స్థాయికి రావడానికి ఆయనకు బాగా హెల్ప్‌ అయిన విషయాలలో ఆయన గంభీరమైన, స్వచ్చమైన ఉచ్చారణ కూడా పెద్ద తోడ్పాటును అందించాయి. ఇక తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌కు సైతం ఆయన వాయిస్‌, తెలుగు భాషపై ఆయనకున్న పట్టు అందరికీ తెలిసిందే. కాగా త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయనున్నారు. 

హిందీ వెర్షన్‌ ట్రైలర్‌కు అమితాబ్‌ వాయిస్‌ఓవర్‌ ఇవ్వనుండటం, తెలుగు వెర్షన్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ వాయిస్‌ఓవర్‌లు అందించడనుండటంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమాలో ఎంతో సంక్లిష్టమైన 'ఘాజీ' కథను ప్రేక్షకులకి అర్ధమయ్యేలా చెప్పి, ఆడియన్స్‌ను సినిమాలో ఇన్‌వాల్వ్‌ చేసే బాధ్యతను తెలుగులో రానా బాబాయ్‌ విక్టరీ వెంకటేష్‌ వాయిస్‌ ఓవర్‌తో చెప్పనుండగా, హిందీలో ఆ బాధ్యతను మరో బాలీవుడ్‌స్టార్‌కి అప్పగించనున్నారు. ఇక రానా తేజ దర్శకత్వంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా 'నేనే రాజు.. నేనే మంత్రి' చిత్రాన్ని సోలోహీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం యాగంటిలో జరుగుతోంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement