మెగా హీరోలు మరలా సందడి చేయనున్నారు..!

Wed 11th Jan 2017 10:06 PM
మెగా హీరోలు మరలా సందడి చేయనున్నారు..!

ఇప్పటికే జనవరి 1వ తేదీన పవన్‌తో పాటు సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌లు కూడా తమ ఫస్ట్‌లుక్స్‌తో, టీజర్‌తో సందడి చేశారు. ఇప్పటికే రేపు విడుదల కానున్న చిరు 150వ చిత్రం 'ఖైదీ నెంబర్‌150 ' విడుదలకు సర్వం సిద్దం అవుతోంది. ఇక సంక్రాంతి రోజున అంటే 14వ తేదీన కూడా మెగా హీరోలు మరలా సందడి చేయనున్నారు. అదే రోజున ఇప్పటికే ఫస్ట్‌లుక్స్‌తో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం 'కాటమరాయుడు' 

ఫస్ట్‌ టీజర్‌ రిలీజ్‌ కానుంది. ఈ చిత్రాన్ని డాలీ దర్శకత్వంలో నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పవన్‌ స్నేహితుడు శరత్‌మరార్‌ నిర్మిస్తుండగా, శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తమిళ 'వీరం' ఆధారంగా తెరకెక్కుతోంది. మరోవైపు అతి తక్కువ చిత్రాలతోనే మంచి క్రేజ్‌ సంపాదించుకున్న మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ -రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'విన్నర్‌' చిత్రం 

ఫస్ట్‌ టీజర్‌ కూడా విడుదలకానుంది. 'తిక్క' చిత్రంతో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిన సాయి 'విన్నర్‌' చిత్రం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇక స్టైలిష్‌స్టార్‌ బన్నీ హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా తెరకెక్కుతోన్న 'డిజె' చిత్రం షూటింగ్‌తో పాటు ఎడిటింగ్‌ వంటి పోస్ట్‌ప్రొదక్షన్‌ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇదే తేదీన 'డిజె' ఫస్ట్‌లుక్‌ రానుందనే ప్రచారం కూడా జరుగుతోంది. 

Latest

Note: Please DO NOT use ABUSIVE language in comments.

Latest

Popular in Times

Contact us    Privacy     © 2017