మాస్‌ మహారాజా డిసైడ్‌ అయ్యాడు..!

Tue 10th Jan 2017 07:07 PM
tollywood hero ravi teja,producer dil raj,director anil ravipudi,ntr,ravi teja new two movie comming  మాస్‌ మహారాజా డిసైడ్‌ అయ్యాడు..!
మాస్‌ మహారాజా డిసైడ్‌ అయ్యాడు..!

'బెంగాల్‌టైగర్‌' తర్వాత రవితేజ కెరీర్‌ విషయంలో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. ఎందరో దర్శకులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా ఆ వెంటనే మరలా అన్ని చిత్రాలను పక్కనపెడుతూ, భారీ గ్యాప్‌ తీసుకున్నాడు. దీంతో ఆయన కెరీర్‌ ఇక ముగిసిందనే విమర్శలతో పాటు ఆయన పలువురు దర్శకులకు హ్యాండ్‌ ఇవ్వడం, దిల్‌రాజు- వేణుశ్రీరాంల కాంబినేషన్‌లో 'ఎవడో ఒకడు' చిత్రాన్ని ప్రారంభించి, మరీ క్యాన్సిల్‌ చేయడంతో దిల్‌రాజుతో రవితేజకు గొడవలు జరిగాయని కూడా వార్తలు వచ్చాయి. ఇవి నిజమే అయినప్పటికీ రాజకీయాలలోలాగానే, సినీ పరిశ్రమలో కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే విషయాన్ని ఆయన తాజాగా మరోసారి నిరూపించడానికి రెడీ అయ్యాడు. 

ఈ నెలాఖరులో ఆయన దిల్‌రాజు నిర్మాతగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. ఇక అనిల్‌ ఎన్టీఆర్‌తో చేయాలనుకున్న కథనే రవితేజతో చేయనున్నాడని తెలుస్తోంది. ఇక ఫిబ్రవరిలో ఆయన మరో చిత్రాన్ని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. అప్పుడెప్పుడో ఆయన విక్రమ్‌సిరి అనే కొత్త దర్శకునితో చిత్రం చేయనున్నాడనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన విక్రమ్‌సిరితో కూడా చిత్రం చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మించనున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌ను ఒకేసారి పూర్తిచేయాలని మాస్‌ మహారాజా డిసైడ్‌ అయ్యాడు. ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేసిన ఆయనకు 2016 మాత్రం షాక్‌నిచ్చింది. ఆ లోటును ఆయన ఈ ఏడాది తీర్చనున్నాడు. ఆయన తరహా చిత్రాల అభిమానులకు ఇది శుభవార్తేనని చెప్పవచ్చు. ఇక ఈ మధ్య తీసుకున్న గ్యాప్‌లో ఆయన ఎంతో కష్టపడి మరలా పాత రవితేజలాగా లుక్‌ను సాదించాడని సమాచారం. మొత్తానికి ఈ ఏడాది రవితేజ కెరీర్‌కు ఈ రెండు చిత్రాలు కీలకంగా మారానున్నాయనేది వాస్తవం. 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017