Advertisement

'గౌతమీపుత్ర..' కి వాడినవి కాపీనా..?

Wed 21st Dec 2016 11:45 AM
gautamiputra satakarni,chiranthan bhatt,music,bajirao mastani,copy tunes,gpsk  'గౌతమీపుత్ర..' కి వాడినవి కాపీనా..?
'గౌతమీపుత్ర..' కి వాడినవి కాపీనా..?
Advertisement

బాలకృష్ణ 100 వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ని డైరెక్టర్ క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణకి తల్లిగా హేమమాలిని, భార్యగా శ్రీయ నటిస్తుంది. ఇక ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచేసింది. ఇక ఈ చిత్ర పాటలను ఈ నెల 26 న తిరుతిలో విడుదల చెయ్యడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని గ్రాఫిక్ వర్క్స్ లో బిజీగా వుంది. ఇక ఈ సినిమాకి ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకోగా.. దేవిశ్రీ వేరే కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఇక క్రిష్ తనకు వరస సినిమాలకు మ్యూజిక్ కంపోజ్  చేసిన చిరంతన్ భట్ ను 'గౌతమీపుత్ర...' కి మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు. 

అయితే ఇపుడు 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి చిరంతన్ భట్ కంపోజ్ కొన్ని పాటలు బాలీవుడ్ హిస్టారికల్ మూవీ 'బాజీరావ్ మస్తానీ' లోని సాంగ్స్ ని నుంచి కాపీ కొట్టారనే రూమర్స్ బయలుదేరాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'బాజీరావ్ మస్తానీ'లోని కొన్ని ట్యూన్స్ ని 'గౌతమీపుత్ర శాతకర్ణి' లో వాడుకున్నట్లు ఉందని కొంతమంది  చెబుతున్నారు. 'శాతకర్ణి' చిత్రంలో బాలకృష్ణ, శ్రీయా ల మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సీన్స్ లో పాటలు.. 'బాజీరావ్ మస్తానీ'లోని సాంగ్స్ ను పోలి ఉన్నాయన్నది కొందరి వాదన.

అయితే ఈ రూమర్స్ ని 'గౌతమీపుత్ర శాతకర్ణి' మేకర్స్ కొట్టిపడేస్తున్నారు. తాము ఏ చిత్రంలోని ట్యూన్స్ ని వాడుకోలేదని అన్ని సొంతంగా చేసుకున్న ట్యూన్స్ అని చెబుతున్నారు. చిరంతన్ భట్ 'గౌతమిపుత్ర....' కి కంపోజ్ చేసిన సాంగ్స్ పూర్తిగా ఒరిజినల్ అని వాదిస్తున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement