Advertisement

మోడీ నిర్ణయానికి నెల రోజులు నిండాయ్..!

Fri 09th Dec 2016 10:02 PM
narendra modi,dimonetization,one month,prime minister  మోడీ నిర్ణయానికి నెల రోజులు నిండాయ్..!
మోడీ నిర్ణయానికి నెల రోజులు నిండాయ్..!
Advertisement

భారత ప్రధాని నరేంద్ర మోడి పెద్ద నోట్ల రద్దు వంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకొని సరిగ్గా నెలరోజులైంది. మోడి సమాజాన్ని ప్రక్షాళన చేయాలన్న తలంపుతో అవినీతి అంతం చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఇంక నల్ల‌ధ‌నాన్ని ఏరిపారేయాలన్న స్థిరమైన సంకల్పంతో చేపట్టి ఒక భావోద్వేగ నిర్ణయాన్ని తీసుకొని ఖచ్చితంగా నెలరోజులైంది. అయితే ఈ పెద్ద నోట్ల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విషయాన్ని ఒకసారి చర్చించుకుంటే.. ఒక్క విషయం మాత్రం పక్కాగా అర్థమౌతుంది. అదేంటంటే దొంగనట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చు అన్నది మాత్రం తెలుస్తుంది. ఈ సమాజంలో తనకు తోచిన భావాలను ఉన్నఫలంగా ప్రవేశపెట్టాలంటే ఎంతో ఇబ్బందులున్న మాట నిజం. ఏ విషయంలోనైనా తీసుకున్న నిర్ణయంపై పక్కాగా ఇంప్లిమెంట్ జరగాలంటే దాన్ని చాలా స్లోగా ఆచరించాలి. అలా కాకుండా ఉన్నపలంగా నోట్ల రద్దు వంటివి చేపడితే సామాన్యులపై అది అమిత ప్రభావం చూపుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సామాన్యుల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అసలు బొత్తిగా గడవని పరిస్థితి వచ్చింది.

అయితే పెద్ద నోట్ల రద్దు కారణంగా ఇప్పటికిప్పుడు ఏం సాధిస్తుంది ప్రభుత్వం అనే దానికి మాత్రం ఏ మాత్రం సమాధానం దొరకడం లేదు. అన్ని రంగాలతో ముడిపడి ఉన్న ఒక్క విషయాన్ని ఇంప్లిమెంటు చేసేముందు చాలా ఆలోచించాలి. ప్రజలకు సరైన సమాధానాన్ని చెప్పేలా అది ఉండాలి. అలా కాని పక్షంలో... భాజపా డొంక తిరుగుడుగా.. ఒకసారేమో పెద్ద నోట్ల రద్దు.. న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను పెంచ‌డం అంటారు. మరోసారేమో.. టెర్ర‌రిజాన్ని అరిక‌ట్టడానికి అంటారు. ఇంకోసారేమో.. దొంగనోట్లను పూర్తిగా బ్యాన్ చేయడానికి అంటారు. అయితే ఇదంతా ఈ ప్రస్తుత మన సమాజంలో ఆచరణ సాధ్యమా? నగదు రహిత లావాదేవీలు అన్నిచోట్లా, అన్నింటికి వర్తించేలా చెలామనిలోకి తేవడం ఉన్నపలంగా సాధ్యమా? అన్నది ప్రశ్న.  

కాగా ఇప్పటికి దేశంలో క్యూలో నిలబడి, బ్యాంకుల చుట్టూతా తిరిగినా డబ్బు అందక నానా యాతనలు అనుభవించి... 84 మంది నిండు ప్రాణాలు వదిలారు. కాగా వీరందరికీ డబ్బులు ఉన్నా చికిత్స చేసుకొనే స్తోమత ఉన్నా కూడా అలా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇది అధికారికంగా తేలిన లెక్కలు. కానీ అనధికారికంగా ఇంకా ఎంతమంది, ఎన్ని అవస్తలు ఉన్న డబ్బును కూడా ఖర్చుపెట్టుకొని తిండిలేకుండా ఉన్నారో చెప్పలేం. అయితే తాజాగా న‌రేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశాడు. ప్రజలెదుర్కొంటున్న సమస్యల గురించి ఏమాత్రం స్పందించకుండా...తనదైన ధోరణిలో భావోద్వేగంతో స్పందించాడు. ప్రజలంతా బ్యాంకుల వ‌ద్ద, క్యూలలో నిల‌బ‌డుతున్నవారంతా..న‌ల్ల‌ధ‌నంపైనా, అవినీతిపైనా, ఉగ్ర‌వాదంపైనా  చేస్తున్న మ‌హాయ‌జ్ఙంలో మ‌న‌స్ఫూర్తిగా పాల్గొంటున్నారని భలే మెచ్చుకోలుగా మాట్లాడాడు. వారంద‌రికీ తన సెల్యూట్ ను విసిరాడు. అప్పటికప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమేనని వివరించాడు. కానీ ప్రధాని నరేంద్ర మోడి నుండి ప్రస్తుతం ప్రజలు కోరుకుంటున్నది ఇది కాదు. బ్యాంకుల వద్ద, ఏటీయంల వద్ద,  పోస్టాఫీసుల వద్ద క్యూ లను ఎప్పటికి తగ్గిస్తారో చెప్పండంటూ జనం వాపోతున్నారు. ఇది మాత్రం చెప్తే తాను ఎన్ని చెప్పేసినా ఈ సమయంలో ఒప్పేసుకున్నట్టే. అంతే కాకుండా తాను అనుకున్నట్టు మోడి ఇప్పుడు ఇంత కష్టం అనుభవించినా, దీని తర్వాత సామాన్యులు మెరుగైన జీవనాన్ని గడిపేలా చేస్తే నిజంగా మోడి దేవుడే అంటారు. లేకపోతే మోడి మరో విధంగా ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇది నిజం.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement