Advertisement

వంగవీటి కోసం వర్మ ప్లాన్ అదిరింది..!

Fri 09th Dec 2016 09:25 PM
ram gopal varma,vangaveeti,big b,siva to vangaveet,rgv  వంగవీటి కోసం వర్మ ప్లాన్ అదిరింది..!
వంగవీటి కోసం వర్మ ప్లాన్ అదిరింది..!
Advertisement

సంచలనాలకు మారుపేరు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒక సినిమాకు మార్కెట్ ఎలా చేసుకోవాలో వర్మకు బాగా తెలుసు. ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి నోటుతో పబ్లిసిటీ కాకుండా నోటివాక్కుతో పబ్లిసిటీని చేసుకొనేందుకు వర్మ సరికొత్త ప్లాన్ వేస్తున్నాడు. వర్మ సహజంగా ‘వంగ‌వీటి’ అని పెట్టిన పేరుతోనే పబ్లిసిటీ ఆకాశానికి అంటింది. కాబట్టి ఈ సినిమాకోసం ప్రత్యేకంగా పబ్లిసిటీ చేసుకోనక్కరలేకుండా డైరెక్టుగా విడుదల చేసేయవచ్చు. ఎంచేతంటే వంగవీటి అన్న పేరులోనే కావల్సినంత హైప్ తెచ్చిపెట్టే వైబ్రేషన్ కలిగించే శక్తి ఉంది. కానీ వర్మ ఈ సినిమా విడుదలకు ముందు తాను దర్శకత్వం వహించిన మొట్ట మొదటి చిత్రం నుండి నేటి వరకు అంటే శివ నుండి మొదలుకొని సర్కార్ 3 వరకు తాను రూపొందించిన అన్ని సినిమాలపై పరిచయ కార్యక్రమంలా ఓ వేదికను ఏర్పాటు చేయబోతున్నాడు. అదేంటంటే.. వర్మకు తగిన మాస్టర్ మైండ్...ఉపయోగించి వంగవీటి చిత్రానికి గాను విపరీతమైన క్రేజ్ తెచ్చేందుకు ఓ గొప్ప ప్రమోషన్ లాంటిది ఏర్పాటు చేస్తున్నాడు. అందుకోసం అక్కినేని నాగార్జునను మొదలుకొని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని రంగంలోకి దింపబోతున్నాడు. ఈ చిత్రానికి అమితాబ్ బచ్చన్ కు ఏమాత్రం సంబంధం లేకపోయినా సరే.. వర్మ చాలా తెలివిగా ఓ పోగ్రాంను హైదరాబాద్ వేదికగా రూపొందిస్తున్నాడు. ఈ నెల 20వ తేదీన నిర్వహించే ‘శివ టు వంగవీటి’ ప్రోగ్రాం కోసం సుమారు కోటి రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. కాగా వర్మ ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో స‌ర్కార్ 3 సినిమా చేస్తున్నాడు. అంటే వర్మ దర్శకత్వం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఆయన  జీవిత ప్ర‌యాణాన్ని విశ్లేషించే కార్య‌క్ర‌మం అన్న‌మాట‌ ఇది. ఈ కార్యక్రమంలో నాగార్జున నుంచి అమితాబ్ బ‌చ్చ‌న్ వ‌ర‌కూ అంటే.. వ‌ర్మ‌తో ప‌నిచేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ కార్యక్రమంలోనే వంగ‌వీటి చిత్రం తాలూకూ ప్లాటిన‌మ్ డిస్క్ ఫంక్ష‌న్ కూడా నిర్వహించనున్నట్లు టాక్ నడుస్తుంది, మొత్తానికి తనకు ఎదురులేదు అన్నట్లుగా వర్మ మంచి ప్లానే వేశాడుగా. ఏకంగా బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్ ను తెప్పించి దర్శకుడుగా వర్మ గొప్పతనాన్ని ప్రశంసలు కొట్టేసి ఇంక తనకు అడ్డే ఉండదన్నట్లు బాగానే అలోచించాడు వర్మ. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement