Advertisement

హీరోల సిక్స్‌ప్యాక్‌లపై ఆందోళన..!

Thu 08th Dec 2016 03:45 PM
heroes,heroines,size zero,tollywood,tollywood heroes,six pack  హీరోల సిక్స్‌ప్యాక్‌లపై ఆందోళన..!
హీరోల సిక్స్‌ప్యాక్‌లపై ఆందోళన..!
Advertisement

హాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కు, బాలీవుడ్‌ నుండి కోలీవుడ్‌, టాలీవుడ్‌లకు ఏ కొత్త ట్రెండ్‌ అయినా సరఫరా క్షణాల్లో జరుగుతోంది. హాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలు కూడా దేశవ్యాప్తంగా అందరూ ఒకేసారి వీక్షించడానికి వీలు కలుగుతోంది. దీంతో ప్రాంతీయ భాషా చిత్రాలపై, దర్శకనిర్మాతలు, హీరోలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక ఒకప్పుడు హాలీవుడ్‌ను కుదిపేసి, ఆ తర్వాత బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు దిగుమతి అయిన హీరోయిన్ల సైజ్‌జీరో వ్యవహారం అందరికీ తెలిసిందే. మన ప్రేక్షకులు మెచ్చే ముద్దుగుమ్మల విషయంలో సైజ్‌జీరో ఆకృతిని మెచ్చరని ఆ తర్వాత అర్ధమైంది. అంతలోపే సైజ్‌జీరో శరీరాకృతిని సాధించడంలో తామే ముందుండాలని భావించి ఎన్నో కష్టాలు పడి సైజ్‌జీరోగా మారిన హీరోయిన్లను మనవారు ఆదరించలేదు. కానీ ఎంతో శ్రమపడి సైజ్‌జీరోను సాధించిన హీరోయిన్లు వాటి మూలంగా అనారోగ్యం బారిన పడ్డారు. ఇక హీరోల విషయానికి వస్తే హీరో అంటే కండలు తిరిగి ఉండాలి... అనే భావన కూడా హాలీవుడ్‌ నుంచి వయా బాలీవుడ్‌ టు టాలీవుడ్‌కు వచ్చింది. ఓ చిత్రం కోసం, తమ అభిమానులను అలరించి, తమ మేకోవర్‌ చూపించడం కోసం మన హీరోలు కూడా సిక్స్‌ప్యాక్‌ కోసం క్యూలు కట్టారు. ఇప్పటికీ దీనిపై మన హీరోలకు ఇంకా మోజు తీరలేదు. కానీ అతి తొందరగా సిక్స్‌ప్యాక్‌లు, ఎయిట్‌ ప్యాక్‌ల కోసం మన వారిలో కొందరు మాత్రం తమ ట్రైనీల రాంగ్‌ గైడెన్స్‌ వల్ల పక్కదారి పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ వార్తలే నిజమైతే ఇది చాలా ప్రమాదకమరమని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర డైటింగ్‌తో రాత్రింబగళ్లు జిమ్‌లలో కష్టపడి అతి తక్కువ కాలంలో ఈ ప్యాక్‌లు సాధించడం కోసం కొందరు నిషిద్ద స్టెరాయిడ్స్‌ను వాడుతున్నారనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. దీనివల్ల దీర్ఘకాలంలో వారి ఆర్యోగాలపై ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నది వాస్తవం. ఇలా సాధించిన సిక్స్‌ప్యాక్‌లు ఎక్కువ కాలం ఉండవు. కానీ పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని, ఇప్పటికే కొందరు హీరోల విషయంలో ఇది నిరూపితమయిందని కొందరిని ఉదాహరణగా చూపుతున్నారు. ఇదే నిజమైతే తమ ఫ్యాన్స్‌ను మెప్పించడం కోసం హీరోలు తమ ఆరోగ్యాలకే ముప్పు తెచ్చుకోవడం తగదని కొందరు హితవు చెబుతున్నారు. ఈ విషయంలో ఆయా హీరోలపై అభిమానుల ఒత్తిడి తగ్గాల్సివుందంటున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement