Advertisement

ముద్రగడ మొండి వైఖరి మారుస్తాడా..?

Sun 04th Dec 2016 11:03 AM
mudragadda padmanabam,kaapu reservation,mudragada  ముద్రగడ మొండి వైఖరి మారుస్తాడా..?
ముద్రగడ మొండి వైఖరి మారుస్తాడా..?
Advertisement

ఎన్నిక‌ల సమయంలో చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన హామీ కాపులకు రిజ‌ర్వేషన్ల అంశం. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన మాటపై నిలబడక పోవడంతో.. కాపులంతా ఉద్యమాల బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే తన ఉద్యమ సెగను ఆంధ్రప్రదేశ్ లో నలు దిశలా చాటారు. ఇంకా చాటుతూనే ఉన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేంతవరకూ చాటుతారని చాటిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే కాపు ఉద్యమానికి నాయకుడుగా ఉన్న ముద్రగడ పద్మనాభంపైనే అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగా ఏ స్వార్ధం లేకుండా ముద్రగడ ఉద్యమాన్ని నడుపుతున్నారా? లేకా ఏదైనా ప్రయోజనం ఆశించి ఉనికి కోసం కాపు ఉద్యమానికి పూనుకున్నారా? అనేది అంతుపట్టని విషయంగా పరిణమించింది.

ఒకవేళ ముద్రగడలో ఎటువంటి స్వార్థం లేకుండానే ఉద్యమం నడుపుతున్నాడు అనుకుంటే.. ఈ  చేస్తున్న ఉద్య‌మం అనుకున్నవిధంగా జరుగుతుందా? ఆ జరుగుతున్నది కాపుల రిజర్వేషన్లను సాధించేలా ఉందా? ఇది కాపుల డిమాండ్ల‌కు అద్దం ప‌డుతుందా..? ఆశించిన విధంగా ముద్రగడ పోరాటంతో ప్ర‌భుత్వంపై ఒత్తిడి  తెస్తున్నాడా.? అనే ప్రశ్నలు ప్రతి వ్యక్తిని పిండేస్తున్నాయి. మళ్లీ ముద్రగడ ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించడంతో ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమౌతున్నాయి. కాగా ఈ నెల 18న న‌ల్ల బ్యాడ్జీలు పెట్టుకొని కంచాలూ, గ‌రిటెల‌తో నిర‌స‌న తెలపనున్నట్లు ముద్రగడ ప్రకటించాడు. అలాగే జ‌న‌వ‌రి 8వ తేదీన కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌, అదే జనవరి 20న తేదీన స‌త్యాగ్ర‌హ పాద‌యాత్ర చేయ‌నున్నట్లు ముద్రగడ వెల్లడించాడు. అయితే ఈ యాత్రను రావుల‌పాలెం నుండి అంత‌ర్వేది వ‌ర‌కు కొనసాగిస్తానని వెల్లడించాడు. కాగా ఇలాంటిదే ముద్రగడ న‌వంబ‌ర్‌ మాసంలో కూడా ఓ యాత్ర‌ను చేపడితే అది అంతలా ముందుకు పోలేదు. కారణం పోలీసులు అనుమతి ఇవ్వక పోవడమే. అయితే జ‌న‌వ‌రిలో జరపబోయే యాత్రకు కూడా పోలీసుల అనుమ‌తి తీసుకొనే ప్రసక్తే లేదని ముద్రగడ భీష్మించుకు కూర్చున్నాడు. ఇలాంటి ముద్రగడ మొండి వైఖరితోనే ప్రజలకు అనుమానాలు కలుగుతున్నట్లుగా తెలుస్తుంది. రిజ‌ర్వేష‌న్ల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా కాలం వేచి చూశామని, అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలపక పోవడంతోనే తప్పని పరిస్థితుల్లో తాము ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ముద్రగడ వెల్లడిస్తున్నాడు. అయితే ముద్రగడ ఉద్యమ కార్యాచ‌ర‌ణ విధానం బాగానే ఉంది గానీ, దాన్ని అమ‌లు చేయడంలోనే కొన్ని లోపాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. కాపు రిజర్వేషన్లపై ముద్రగడ మొండి వైఖరితో పోరాటం చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ విధానాన్నే అవలంభిస్తే  ఈసారి కూడా ముందుగా పోలీసుల అనుమతిని తీసుకోకపోతే గతంలో జరిగిన సీనే రీపీట్ అవ్వడం ఖాయమని భావిస్తున్నారు జనం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement