Advertisement

నిజంగా.. గౌతమీపుత్ర శాతకర్ణి ది రికార్డే!

Wed 30th Nov 2016 02:55 PM
gautamiputra satakarni,balakrishna,krish,record,gpsk  నిజంగా.. గౌతమీపుత్ర శాతకర్ణి ది రికార్డే!
నిజంగా.. గౌతమీపుత్ర శాతకర్ణి ది రికార్డే!
Advertisement

ఈ రోజుల్లో చాలా చిత్రాలు నిడివి సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎడిటింగ్‌ సరిగ్గా చేయకపోతే మాత్రం తిప్పలు తప్పడంలేదు. చివరకు తెరపై ఎక్కువ సేపు తమ అభిమాన హీరోలను చూడాలని ఆశపడే అభిమానులు సైతం నిడివి ఎక్కువగా ఉంటే తలలు పట్టుకుంటున్నారు. కానీ దర్శకుల బలవంతం వల్ల, హీరోల ఒత్తిడి వల్ల అనవసరంగా వచ్చే సీన్స్‌ను, ఫైట్స్‌ను, అర్ధంపర్ధంలేని కామెడీ పేరుతో తీసే సాగతీత సీన్స్‌ వంటివి ఉంటే ఆ చిత్రాలకు మొదటి షోకే నెగటివ్‌ టాక్‌ వస్తోంది. దాంతో హడావుడిగా తమ చిత్రాలలోని కొన్ని సీన్స్‌ను రిలీజ్‌ తర్వాత ట్రిమ్‌ చేస్తున్నప్పటికీ, అప్పటికే నెగటివ్‌ టాక్‌ బాగా వ్యాపిస్తుండటంతో బాగున్న చిత్రాలు కూడా నెగటివ్‌ టాక్‌ను మూటగట్టుకుంటున్నాయి. ఇలా నిడివి సమస్య వల్ల రజనీకాంత్‌ నుండి శ్రీనివాసరెడ్డి వరకు నష్టపోయారు.. నష్టపోతున్నారు. తాజాగా వచ్చిన 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రం బాగున్నప్పటికీ దీని వల్లే కలెక్షన్లు రావడం లేదు. పాతకాలంలోని ప్రేక్షకులు సినిమా ఎంత పెద్దదైనా ఓపిగ్గా చూసేవారు. నిన్నమొన్నటి వరకు బాలీవుడ్‌లోని చిత్రాలు కూడా పెద్ద నిడివితో వచ్చినప్పటికీ ఘనవిజయాలను నమోదు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కానీ నేడు అన్నిభాషల్లోని ఆడియన్స్‌ అభిరుచి మారుతోంది. కానీ కొందరు దర్శక, హీరోలు తమ చిత్రానికి నిడివి సమస్య వస్తుందని ముందుగానే ఎడిట్‌ చేసిన ఫైట్స్‌ను, పాటలను, సీన్స్‌ను సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చిన తర్వాత నిదానంగా కలిపి ప్రేక్షకులను రెండోసారి థియేటర్లకు వచ్చేలా చేస్తున్నారు. ఇందులో కొరటాల శివ, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వంటి దర్శకులను ఉదాహరణగా చెప్పవచ్చు. 

మొత్తానికి నిడివి రెండున్నర గంటలకు మించిన చిత్రాలను ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. ఇక ఈ సమస్య ఎక్కువగా చారిత్రాత్మకమైన బయోపిక్‌లకు వస్తుంది. పాత కాలం నుంచి నిన్నమొన్నటి 'రుద్రమదేవి' వరకు ఇదే జరిగింది. బాలీవుడ్‌లో కూడా ఇదే పరిస్థితి. సీన్స్‌ కట్‌ చేయాలని భావిస్తే వాస్తవ సంఘటలను మరిచి, చారిత్రక గాథకు న్యాయం చేయలేదనే విమర్శలు వస్తాయి. ఎవరి బయోపిక్‌ అయినప్పటికీ కొన్ని సీన్స్‌ను తీసివేస్తే కథాపరంగా కూడా సమస్యలు వస్తాయి. కానీ క్రిష్‌, బాలయ్యలు మాత్రం అమరావతిని కేంద్రంగా చేసుకొని పాలించిన రాజు శాతకర్ణికు చెందిన యదార్థగాధ అయినప్పటికీ ఈ చిత్రాన్ని కేవలం 2 గంటల 12 నిమిషాల రన్‌టైంకు కుదించారు. అంటే చిత్రం ఎక్కడా ల్యాగ్‌ లేకుండా ఉత్కంఠభరితంగా సాగుతుందని అంటున్నారు. ఇందులో కొన్ని పాటలను కూడా ప్రస్తుతానికి పక్కనపెట్టారని, చిత్రం ఘనవిజయం దిశగా సాగితే వాటిని అదనపు ఆకర్షణగా జోడించాలని ముందస్తుగా నిర్ణయం తీసుకోవడం, దర్శకుడి సలహాకు అనుగుణంగా ఆయనకు ఫ్రీడమ్‌ ఇచ్చిన స్టార్‌ బాలకృష్ణ ఈ విషయంలో ముందుచూపుగా వ్యవహరిస్తున్నందుకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. అయినా వెండితెరపై చూసే దాకా ఎలా ట్రిమ్‌ చేశారు? కట్టె, కొట్టే, తెచ్చే విధంగా ముగించేసారా? అనేది చెప్పలేమంటున్నారు. మరి ఫలితం ఎలా ఉన్నా... బాలయ్య-క్రిష్‌లు బయోపిక్స్‌లో రికార్డు క్రియేట్‌ చేశారనే ప్రస్తుతానికి ఒప్పుకోవాలి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement