Advertisement

రోజు రోజుకు దూరమౌతున్న అల్లరోడు..!

Sun 20th Nov 2016 07:11 PM
allari naresh,b.v.s.n. prasad producer,intlo deyyam nakem bhayam movie  రోజు రోజుకు దూరమౌతున్న అల్లరోడు..!
రోజు రోజుకు దూరమౌతున్న అల్లరోడు..!
Advertisement

నవంబర్‌లోనే విడుదల కావాల్సిన పలు చిత్రాలు, చివరకు డబ్బింగ్‌ చిత్రాలు కూడా మోదీ ఎఫెక్ట్‌ మూలంగా రిలీజ్‌వాయిదాలు పడుతున్నాయి. కానీ కొంత మంది మాత్రం తెగించి వస్తున్నారు. ఇక భారీ నిర్మాతగా పేరుపొందిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, హాస్యచిత్రాలను తెరకెక్కించడంలో సిద్దహస్తునిగా పేరున్న నాగేశ్వర్‌రెడ్డిల కాంబినేషన్‌లో అల్లరి నరేష్‌ హీరోగా రాజేంద్రప్రసాద్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్న 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' చిత్రం కూడా వాయిదా పడింది. ఇక ఈ చిత్రం విడుదల డిసెంబర్‌లో ఉంటుందని అంటున్నారు. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా హర్రర్‌ కామెడీగా రూపొందిన ఈ చిత్రంపై అందరూ బోలెడు నమ్మకం పెట్టుకొని ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య వరస ఫ్లాప్‌లలో ఉన్న అల్లరోడుకి ఈచిత్ర విజయం అత్యంత ముఖ్యమనే చెప్పాలి. అయితే ఈ చిత్రంపై ఎవ్వరికీ పెద్దగా నమ్మకం లేకపోవడం వల్లే ఈ చిత్రాన్ని ఈ సమయంలో విడుదల చేయకుండా వాయిదా వేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే తెలిసి తెలిసి తెగింపు చేయడంలో అర్ధం లేదని, ఎంతో అనుభవం ఉన్న దర్శకనిర్మాతతో పాటు హీరో అల్లరినరేష్‌ కూడా రిస్క్‌ వద్దనుకుంటున్నారనేది వాస్తవం. అయితే ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసినా తిప్పలు తప్పవని అర్ధమవుతోంది. డిసెంబర్‌9న 'ధృవ'గా రామ్‌చరణ్‌ రానున్నాడు. డిసెంబర్‌ 16న సూర్య 'సింగం3'గా వస్తున్నాడు. ఇక క్రిస్మస్‌ కానుకగా దిల్‌రాజు - నానిల 'నేను...లోకల్‌' చిత్రం కూడా విడుదల కానుంది. దీంతో పాటు మరికొన్ని మీడియం, లోబడ్జెట్‌ చిత్రాలు కూడా డిసెంబర్‌లో రిలీజ్‌కు డేట్స్‌ వేటలో ఉన్నాయి. శ్రీని అవసరాల హీరోగా బాలీవుడ్‌ 'హంటర్‌'కు రీమేక్‌గా వస్తున్న'సోగ్గాడు' చిత్రం కూడా డిసెంబర్‌లోనే విడుదల కానుంది. ఇలా చూసుకుంటే అల్లరినరేష్‌ డిసెంబర్‌లో వచ్చినా సోలోగా ముందుకు వచ్చే అవకాశం లేదు. కనీసం పెద్ద చిత్రాలకు రెండు వారాలా గ్యాప్‌ ఉండేలా చూసుకోవాలనుకుంటున్న అల్లరోడి ఆశ నెరవేరేట్లు కనిపించడం లేదు. కాగా ఈ చిత్రం విడుదల ఎప్పుడుంటే తనకే తెలియదని అల్లరోడు అనడం ఇప్పుడు హట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement