Advertisement

పురంధేశ్వ‌రి మళ్లీ పార్టీ మారుతోంది..!

Fri 14th Oct 2016 06:45 PM
daggubati purandeswari,ysr congress party,ysrcp,bjp,tdp,chandrababu,daggubati purandeswari party change  పురంధేశ్వ‌రి మళ్లీ పార్టీ మారుతోంది..!
పురంధేశ్వ‌రి మళ్లీ పార్టీ మారుతోంది..!
Advertisement

కాంగ్రెస్ పార్టీ నుండి కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన చాలా సుధీర్ఘమైన రాజ‌కీయ చరిత్ర ఉన్న మ‌హిళా నేత‌ పురంధేశ్వ‌రి. అయితే కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలను చీల్చిందన్న కోపంతో ఆ పార్టీ నుండి బయటకు వచ్చి తెదేపాలో చేరేందుకు మనస్కరించక, అతికష్టంగానే భాజపాలో చేరిపోయింది పురందేశ్వరి. కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ప్ర‌జాసేవ‌లో లీనమై సోనియా చేత మంచి డైన‌మిక్ లేడీ లీడ‌ర్‌ అనిపించుకున్నారు పురందేశ్వరి. ఇప్పుడు మాత్రం పురందేశ్వరి ఏ పదవీ లేకుండా ఖాళీగానే ఉంది. ఒట్టిగా భాజ‌పా నాయ‌కురాలిగా మాత్రమే కొన‌సాగుతుంది. ప్రస్తుతం ఏపీలో భాజపా ఊసే లేదు. ఇలాగే కొనసాగితే 2019 సాధారణ ఎన్నిక‌ల్లో ఆంధ్రప్రదేశ్ లో భాజ‌పా ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదని అందరికీ తెలిసిన విషయమే. ప్ర‌త్యేక హోదా ఎఫెక్ట్ కూడా ఆంధ్రాలో భాజపాకి కలిసి రాని అంశం. దీంతో అన్నింటినీ బేరీజు వేసుకున్న పురందేశ్వరి పార్టీ మారాలనే ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.

ఇలాంటి సందర్భంలో ఇక భాజపాలో కొనసాగితే తన రాజకీయ భవిష్యత్ కే ప్రమాదం వాటిల్లుతుందన్న సందిగ్ధావస్థల్లో పడింది పురందేశ్వరి. ఎందుకంటే అటు చంద్ర‌బాబు నాయుడు తో పని చేయలేక, ఇటు భాజపాలో చేద్దామన్నా మంచి హోదా లేక అలా మిన్నకుంటడం ఇష్టం లేకుండా తయారైంది పురందేశ్వరి పరిస్థితి. అయితే ఇప్పుడు చిన్న‌మ్మ వైకాపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అసలే పురందేశ్వరి లాంటి వాళ్ళకోసం జగన్ పార్టీ కూడా యోచిస్తుంది. పురంధేశ్వ‌రి వైకాపాలోకి వస్తుందన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి సంచలనం రేపుతుంది. స‌రైన నాయ‌కుల కోసం వైకాపా తీవ్రంగా కుస్తీలు పడుతుంది. ఈ సమయంలో పురందేశ్వరి వైకాపాలో చేరితే ఆ పార్టీకి కొత్త శక్తిని ఇచ్చినట్లుగా భావించి ఆ విధంగా పార్టీ బలోపేతం కావచ్చని కూడా వైకాపా ఆలోచిస్తుంది. చూద్దాం ఏ జరుగుతుందో?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement