Advertisement

చంద్రబాబుకు పవన్‌ పంచ్‌...!

Thu 13th Oct 2016 07:30 PM
chandrababu naidu,pawan kalyan,mega aqwa food park,punch  చంద్రబాబుకు పవన్‌ పంచ్‌...!
చంద్రబాబుకు పవన్‌ పంచ్‌...!
Advertisement

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ది పేరుతో అనేక కార్యక్రమాలను చేస్తోంది. దీనిలో తప్పుపట్టేందుకు ఏమీ లేదు. కానీ ప్రగతి వల్ల ప్రజలకు మేలు జరగకుండా కీడు జరిగితే మాత్రం ఎవరైనా తప్పు పట్టాల్సిందే. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ తన వద్దకు వస్తున్న పలువురు చెబుతున్న వాదనలు వింటూనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చురక అంటించారు. ప్రజల పురోగతికి ఉపయోపడని ప్రగతి ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. కాగా ప్రజలను భయాందోళనలకు గురిచేసే, అభద్రతకు దారి తీసే ప్రగతి అవసరం లేదని ఆయన చంద్రబాబును ఉద్దేశించి ఓ పంచ్‌ మాత్రం వేశాడు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న మెగా అక్వా ఫుడ్‌ పార్క్‌ స్దాపిస్తే దానివల్ల 30 గ్రామాలు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొనాల్సి వుంటుందని ఇప్పటికే పలువురు చంద్రబాబుకు వినతి చేశారు. కానీ అభివృద్ది అనే పేరుతో ఇలా గ్రామాలకు గ్రామాలు ఈ కాలుష్యాన్ని ఎదర్కోవలసిందేనా అని ఆ 30 గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. దీంతో పవన్‌ తనదైన శైలిలో బాబుకు ఫస్ట్‌టైం పంచ్‌ ఇచ్చాడు. మరి రాబోయే రోజుల్లో పవన్‌ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు స్పీడందుకుంటాయని అంటున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement