Advertisement

సినిమా శృంగారంపై వెంకయ్య..ఇలా..!

Thu 29th Sep 2016 08:39 PM
venkayya naidu,indywood carnival,venkayya naidu about cinemas,venkayya naidu about exposing  సినిమా శృంగారంపై వెంకయ్య..ఇలా..!
సినిమా శృంగారంపై వెంకయ్య..ఇలా..!
Advertisement

నేటి సినిమాలలో పండించే శృంగారంపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అదిరిపోయే వ్యాఖ్యలు చేశాడు. నాలుకే కదా మరి అది ఎలా పడితే అలా మాట్లాడుతుంది. కొంతమందికి అది చాలా ఈజీగా అలవోకగా అలా నర్తిస్తూ ఉంటుంది. కాగా తాజాగా వెంకయ్యనాయుడు సినిమాల పరంగా వస్తున్న మార్పులను గురించి ప్రస్తావిస్తూ హాట్ వ్యాఖ్యలు చేశాడు.  అలనాటి అంటే ఆయన కుర్రతనం రోజులలో హీరో హీరోయిన్లు ఇద్దరూ హావభావాలతోనే ప్రేమ భావాల్ని శృంగారాన్ని పండిస్తే, ఇప్పటి హీరో, హీరోయిన్లు ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఎంతగా రాసుకుంటూ పూసుకుంటూ తిరుగుతున్న అటువంటి శృంగార భావాలను, శృంగార రసాన్ని ప్రేక్షకుడిలో కలిగించలేక పోతున్నారని ఆయన వెల్లడించాడు. ఆన్ స్క్రీన్ లో పలికించే భావాలను బట్టి ప్రేక్షకుడిలో అనురక్తి కలుగుతుంది. ఏ భావం అయితే స్క్రీన్ మీద పండుతుందో ఆ భావం ప్రేక్షకుడిలో కలిసి రసానందానికి గురౌతాడు. అటువంటి భావాలను పూర్తిగా ఆన్ స్క్రీన్ మీద నేటి హీరో హీరోయిన్లు కలిగించ లేకపోతున్నారు అన్నాడు వెంకయ్య. అంటే ఆయన భావం ఆఫ్ స్క్రీన్ కే ఆ భావాలను పరిమితం చేసుకుంటూ అంతవరకే తెగనరికేసుకుంటున్నారని కావచ్చు.  

కాగా గత కొద్దిరోజులుగా రామోజి ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఇండీవుడ్ కార్నివాల్ లో పాల్గొని చేసిన వెంకయ్య నాయుడు కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇంకా ఆయన మాట్లాడుతూ..  ప్రస్తుతం సినీ రంగమంతా ప్రచార ఆర్భాటాలతోటే ముందుకు పోతుంది తప్ప విషయం నాస్తిగా కనపడుతుంది అన్నాడు. సంగీతం స్థానంలో వాయిద్యం వచ్చి చేరిందని విమర్శించాడు. ఇదిలా ఉండగా అంతలోనే తేరుకొని భారతీయ సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయిని ఆకర్షించే సత్తా ఉందని తెలిపాడు. కాగా ఇండీవుడ్ కు వచ్చిన విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించాడు. విదేశీయులు సైతం ఇక్కడ పెట్టుబడులు పెట్టి వినోదాన్ని అందించాలని ఆయన ఆకాంక్షను వివరించాడు. సినిమాలు అనేవి కేవల వినోదమే కాకుండా సందేశంతో కూడి రెండూ జోడు గుర్రాలై సాగాలని తెలిపాడు. చివరగా ఓ ఆసక్తికర కామెంట్ చేశాడు.  అలనాటి సినిమాలు  ఏడాది పాటు అలా ఆడేవని, కానీ నేడు వారం ఆడితే అది మహా గొప్పగా భావించాల్సి వస్తుందని కాలంతో అన్నీ చాలా పాస్ట్ పాస్ట్ గా మారిపోతున్నాయని అన్నాడు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement