Advertisement

సింహం సింగిల్ గా వస్తాడా…!

Tue 06th Sep 2016 01:05 PM
rajinikanth,politics,political bheti,abdul kalam,friend,bjp  సింహం సింగిల్ గా వస్తాడా…!
సింహం సింగిల్ గా వస్తాడా…!
Advertisement

దేవుడు ఆదేశిస్తే రజినీ కాంత్ పాటిస్తాడు. నా దారి రహదారి, నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు అంటూ తను డైలాగ్ లను చెక్కినట్లుగా మాట్లాడుతూ అశేష ప్రజాభిమానులను ఏర్పరచుకున్న అసాధారణ నటుడు రజనీకాంత్. అతడు కొన్ని దశాబ్దాల కాలంగా చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో నీరాజనాలు అందుకుంటున్నాడు. అసలు  భారత దేశంలో ఏ హీరోకి, ఇంతటి క్రేజ్ ను చూసి ఉండం. ఆయన్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఇంతటి క్రేజ్ ఉన్న హీరోని చూడగలమా అనిపిస్తుంటుంది.  కాగా రజనీ కాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఎప్పటినుండో పలు ఊహాగానాలు రేగుతూ, చల్లారిపోతూ ఉన్నాయి. ఆయన ఎవరైనా రాజకీయ నాయకుడిని కలిసినా, తనను మోడీ లాంటి ప్రముఖ రాజకీయనాయకులు కలిసినా ఈ చర్చ వస్తుంది. అలా ఈ చర్చ దశాబ్ద కాలంగా వస్తూ ఉంది. మళ్ళీ ఈ మధ్య రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం పై ఉహాగానాలు చెలరేగాయి.

ఈ మధ్య రజినీకాంత్ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సన్నిహితుడైన పోన్ రాజ్ తో భేటీ అయ్యాడు. దాని కారణంగా ఈ ఊహాగానాలు చెలరేగాయని చెప్పవచ్చు. ఈ పోన్ రాజ్ కూడా ఓ రకంగా అబ్దుల్ కలాం విజన్ ఇండియా పార్టీ వ్యవస్థాపకుడు. తాజాగా వీరిద్దమరి మధ్య జరిగిన భేటీలో రజిని పోన్ రాజ్ తో తన రాజకీయ రంగ ప్రవేశంపై చర్చించినట్లుగా పలు అనుమానాలు... దానిలోంచి ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా 2014 సాధారణ ఎన్నికల్లోనే భాజపా రజనీకాంత్ తమ పార్టీలోకి రప్పించాలని తీవ్రంగా ప్రయత్నించి చూసింది. అప్పట్లో రజినీ ససేమిరా అంటూ ముందు ముందు చూద్దురుగానీ అన్న సంకేతాలను పంపించాడు. అప్పట్లో నరేంద్ర మోడీనే స్వయంగా రజనీని కలవడం జరిగింది. కానీ తాజాగా రజనీకాంత్ ఈ పోన్ రాజ్ తో భేటీ కావడం పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయి. రజనీ కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించడంపై ఏమైనా మంతనాలు జరుపుతున్నారా అన్న చర్చ కూడా అప్పుటే రాజకీయ వర్గాల్లో రాజుకుంది. చూద్దాం ఈ తలైవా ఏదిశగా అడుగులు వేస్తాడో.....?    

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement