Advertisement

'ధృవ' పై అంత నమ్మకమా..!

Tue 30th Aug 2016 07:13 PM
ram charan,dhruva,allu aravind,confident,allu aravind confident on dhruva  'ధృవ' పై అంత నమ్మకమా..!
'ధృవ' పై అంత నమ్మకమా..!
Advertisement

అల్లుఅరవింద్‌ చాలా తెలివైన నిర్మాత. ఏ సినిమా హిట్టవుతుందో, ఏది ఫ్లాప్‌ అవుతుందో బాగా కాచివడపోసిన మేథావి. కాగా ప్రస్తుతం అల్లుఅరవింద్‌ తన గీతాఆర్ట్స్‌ బేనర్‌లో 'మగధీర' తర్వాత రామ్‌చరణ్‌తో 'ధృవ' చిత్రం చేస్తున్నాడు. గత కొన్ని చిత్రాలతో వరసగా హీరో రామ్‌చరణ్‌ అందరినీ డిజప్పాయింట్‌మెంట్‌ చేస్తున్నాడు. అందుకే ఈ 'ధృవ' చిత్రం విషయంలో నిర్మాత అల్లుఅరవింద్‌తో పాటు రామ్‌చరణ్‌ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ చిత్రం తమిళంలో సంచలనం సృష్టించిన 'తని ఒరువన్‌' రీమేక్‌ కావడంతో ఈ చిత్రంపై మెగాభిమానులకు భారీ అంచనాలున్నాయి. కాగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 7న విడుదల చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో ఇప్పటికే కొన్ని ఏరియాల నుండి ఫ్యాన్సీ ఆఫర్స్‌ వస్తున్నప్పటికీ అల్లుఅరవింద్‌ కొన్ని ఏరియాలు మాత్రం అమ్మేది లేదని చెప్పి తమ గీతాఆర్ట్స్‌ బేనర్‌లో ఈ చిత్రాన్ని నైజాం, ఈస్ట్‌ వెస్ట్‌ గోదావరి, కృష్ణ ఏరియాలను మాత్రం తానే స్వయంగా రిలీజ్‌ చేయనున్నాడు. ఈ విషయంలో అల్లుఅరవింద్‌ నమ్మకం చూసి బయ్యర్లతో పాటు ట్రేడ్‌వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement