Advertisement

'బాహుబలి2', 'రోబో2'ల లెక్కలు బాగున్నాయ్!

Sat 30th Jul 2016 08:03 PM
  'బాహుబలి2', 'రోబో2'ల లెక్కలు బాగున్నాయ్!
'బాహుబలి2', 'రోబో2'ల లెక్కలు బాగున్నాయ్!
Advertisement

కొన్నేళ్ల కిందటివరకు తెలుగు సినిమాల కంటే తమిళంలోనే భారీ బడ్జెట్‌ చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలు వచ్చేవి. తమిళ డైరెక్టర్లు అయిన శంకర్‌, మణిరత్నం వంటి దర్శకులు భారీ బడ్జెట్‌తో, షూటింగ్‌కు కూడా ఎక్కువ సమయం వెచ్చించి సినిమాలు చేసేవారు. ఇక శంకర్‌ చేసిన 'రోబో' చిత్రం అయితే దక్షిణాది చిత్రాలను ఓ మలుపుతిప్పింది. సబ్జెక్ట్‌లో ఉన్న దమ్ము, గ్రాఫిక్స్‌ మాయాజాలం, భారీ నిర్మాణ విలువలు, శంకర్‌ టేకింగ్‌తో పాటు ఈచిత్రానికి రజనీకాంత్‌, ఐశ్వర్యారాయ్‌లకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కానీ అదే టైమ్‌లో మన జక్కన్న అలియాస్‌ రాజమౌళి కూడా 'మగధీర'తో ఓ ట్రైల్‌ వేసిచూశాడు. ఈ చిత్రం టాలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. 'మగధీర' ఇచ్చిన కిక్‌తో జక్కన్న భారీ బడ్జెట్‌తో 'బాహుబలి' చిత్రాన్ని తీశాడు. ఈ చిత్ర హీరో ప్రభాస్‌ రేంజ్‌ అప్పటివరకు కేవలం తెలుగుకే పరిమితం. ఇక రానాతో పాటు ఇద్దరు ముగ్గురు ఆర్టిస్ట్‌లు మాత్రమే ఇతర భాషల్లో కొద్దిపరిచయం ఉన్నవారు. కానీ ఈ చిత్రానికి రాజమౌళి పేరు క్రేజ్‌కు కొద్దిగా ఉపయోగపడింది. కానీ ఈ చిత్రం ఇండియాతో పాటు విదేశాల్లో కూడా విడుదలై దాదాపు 700కోట్ల వరకు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. కాగా ఇప్పుడు తమిళంలో శంకర్‌ దర్శకత్వంలో రజనీ హీరోగా 'రోబో2.0', రాజమౌళి దర్శత్వంలో 'బాహుబలి2' చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ రెండు చిత్రాలది దాదాపు ఒకే బడ్జెట్‌. ఈ రెండింటికిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు 1000కోట్లను టార్గెట్‌ చేశాయి. ఇప్పటికీ 'బాహుబలి2'కి రాజమౌళినే ప్రాణం. కానీ 'రోబో2.0' విషయానికి వస్తే రజనీ చరిష్మా, అక్షయ్‌కుమార్‌ల క్రేజ్‌కు తోడు శంకర్‌ ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌. 'కబాలి'లాంటి ఫ్లాప్‌ చిత్రంతోనే రజనీ కోట్లు కొల్లగొట్టాడు, అదే రజనీ ఇమేజ్‌కు అక్షయ్‌, శంకర్‌ల క్రేజ్‌ కూడా తోడైతే సంచలనం ఖాయమంటున్నారు తమిళ ట్రేడ్‌ పండితులు. అందులో ముందుగా 'బాహుబలి2' విడుదల కానుంది. ఆ చిత్రం సాధించే విజయాన్ని దాటాలనేది శంకర్‌ అభిమతంగా తెలుస్తోంది. మొత్తానికి దక్షిణాదికి చెందిన ఇద్దరు దర్శకదిగ్గజాలు ఈ పోటీలో నిలవడంతో యావత్‌ భారత చిత్ర పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తోంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement