Advertisement

బాబు తగ్గి చినబాబుని పెంచుతున్నాడు!

Sat 30th Jul 2016 08:18 AM
chandrababu naidu,nara lokesh,kcr,telangana,bangara telangana  బాబు తగ్గి చినబాబుని పెంచుతున్నాడు!
బాబు తగ్గి చినబాబుని పెంచుతున్నాడు!
Advertisement

ఓటుకునోటు వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చంద్రబాబు విమర్శించలేకపోతున్నాడు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు.. కేసీఆర్‌ను చూసి భయపడుతున్నాడంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ మద్యకాలంలో చంద్రబాబు.. కేసీఆర్‌ను విమర్శించాల్సిన పరిస్థితే వస్తే ఆయనే అడ్డుపడుతున్నాడు. ఈయన ఇలా అంటున్నాడు అంటూ ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు చేస్తున్నాడే కానీ పేరు పెట్టి మాత్రం కేసీఆర్‌ను విమర్శించలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో తన తండ్రి బాధ్యతను తనయుడు నారా లోకేష్‌ తీసుకొని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ ప్రస్తుతం లోటు బడ్జెట్‌లో ఉండడానికి కారణం ఎవరు? కేసీఆర్‌ వెళ్లి ఫాంహౌస్‌లో పడుకుంటే బంగారు తెలంగాణ ఎలా వస్తుంది? బంగారు తెలంగాణ కావాలంటే కరెంట్‌ చార్జీలను ఎందుకు పెంచారు? భూమిలేని వారికి, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలకు భూములు పంచడానికి ఏ ఆంధ్రా పార్టీ కూడా అడ్డం రాలేదు కదా...! అంటూ కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యాడు లోకేష్‌. భవిష్యత్తులో కూడా ఆయన ఇదే దూకుడును కొనసాగిస్తాడా? లేదా?అనేది ఇప్పుడు టిడిపివర్గాల్లో చర్చనీయాంశం అయింది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement