Advertisement

ఏపీ బిల్లుపై జైట్లీ సమాధానం..ఇదేనా?!

Fri 29th Jul 2016 08:04 PM
  ఏపీ బిల్లుపై జైట్లీ సమాధానం..ఇదేనా?!
ఏపీ బిల్లుపై జైట్లీ సమాధానం..ఇదేనా?!
Advertisement

రాజ్యసభలో ప్రత్యేక హోదాపై అరుణ్ జైట్లీ సమాధానం ఇస్తున్నారు. ఏపీ కష్టాల్లో ఉందని అందరూ నా దృష్టికి తెచ్చారు. విభజన అనేది భావోద్వేగాలతో ముడి పడి ఉంటుంది. చిన్న రాష్ట్రాలకు మొదటనుండి మేము ఎప్పుడూ అనుకూలమే. బిజెపి 3  రాష్ట్రాలను విభజించింది. అప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదు. కానీ కాంగ్రెస్ ఏపీని విభజించిన తర్వాత అన్ని సమస్యలే. విభజన వల్ల ఏపీ రెవెన్యూని కోల్పోయింది.  ఏపీ కోలుకోవడానికి సమయం పడుతుంది. జై రామ్ తప్పు వల్లే ఏపీలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాము. కానీ భవిష్యత్తులో ఏపీ కోలుకుంటుంది. అభివృద్ధి  జరిగే వరకు మేము ఏపీకి అండగా ఉంటాము. కేంద్ర ఆదాయం లో రాష్ట్రాలు కు వాటా ఇస్తున్నాము. ఆదాయం లో 42 శాతం వాటా రాష్ట్రాలకే ఇస్తున్నాం. అలాగే ఏపీకి న్యాయం జరిగేలా చూస్తాము.

ప్రస్తుతం కేంద్రం ఆర్ధిక లోటులో వుంది. ప్రతి ఏటా లక్షల కోట్ల అప్పులు తెస్తున్నాం. అన్ని రాష్ట్రాలను సంతృప్తి పరచడం అసాధ్యం. రాజ్యాంగానికి లోబడే నిధుల కేటాయింపు ఉంటుందని... మిత్ర పక్షం అధికారం లో ఉంది కదా అని ఎక్కువ నిధులు కేటాయించడం కుదరదు. ఉమ్మడి ఏపీ ఆర్ధికంగా బలంగా ఉందని ఏపీ విభజన జరిగితే ఆర్ధిక పరమైన సమస్యలు తలెత్తుతాయని అలాగే లోటు ఏర్పడుతుందని ముందే చర్చ జరిగిందని అన్నారాయన. హై కోర్టు విభజనకు నిధులు కేటాయించాలని చట్టంలో ఉందని అన్నారు. విభజన చట్టంలో వున్న వాటిని అమలు చేస్తాం. అలాగే జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని పూర్తి చెయ్యాల్సిందే. చట్ట ప్రకారం ఏపీ లో విద్యా సంస్థలను ఏర్పాటు చేశామన్నారు.  రైల్వే జోన్ విషయం సురేష్ ప్రభు పరిశీలనలో ఉందని చెప్పారు. పోలవరానికి నాబార్డ్ నిధులు వచ్చేలా చేస్తామన్నారు. ఇదంతా బాగానే వుంది కానీ.. ఏపీ బిల్లు గురించి చెప్పమంటే.. కేంద్రం ఆర్ధిక లోటులో ఉందంటూ జైట్లీ లేనిపోని కథలు చెబుతుండటం ఏపీ బిల్లు కోసం చూస్తున్నవారిలో నిరాశను కలిగిస్తుంది.      

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement