Advertisement

డిమాండ్ వుంది కాబట్టే పెంచాడు..కానీ..?

Fri 22nd Jul 2016 02:18 PM
rao ramesh,rao ramesh remuneration hiked,prakash raj,telugu actor rao ramesh,a aa movie  డిమాండ్ వుంది కాబట్టే పెంచాడు..కానీ..?
డిమాండ్ వుంది కాబట్టే పెంచాడు..కానీ..?
Advertisement

టాలీవుడ్ లో విలన్ గా, తండ్రిగా ప్రకాష్ రాజుకి పెట్టింది పేరు. విలన్ గా ఎంత క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాడో ... అలాగే తండ్రిగా అంతే హావభావాలను పలికిస్తాడు. ప్రకాష్ రాజు సినిమాలో వున్నాడు అంటే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా కొందరి హీరోలకు వుంది. అయితే ఆ మధ్య శ్రీను వైట్లతో గొడవ పడిన తర్వాత  ప్రకాష్ రాజు కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు తగ్గాయి. అయినా కూడా అయన తమిళ్ ఇంకా ఇతర భాషలలో బిజీ అయ్యాడు. అయితే ఇక్కడ తెలుగులో ప్రకాష్ రాజ్ కి ధీటుగా మరో నటుడు వచ్చి చేరాడు. ఆయనే రావు గోపాల్రావు కొడుకు రావు రమేష్. చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఒక మంచి కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను, విలన్ గాను తన దైన శైలిలో దూసుకు పోతున్న రావు రమేష్ కోసం టాలీవుడ్ డైరెక్టర్స్ ప్రత్యేకంగా వాళ్ళ సినిమాలో ఒక పాత్రను తయారు చేస్తున్నారంటే అతనికి ఎంత డిమాండ్ వుందో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా వచ్చిన 'అఆ' సినిమాలో రావు రమేష్ విలన్ గా చేసిన పాత్రకు ఫుల్ మార్కులు పడ్డాయి. అయితే పేరున్నప్పుడే అంతా చక్కబెట్టుకోవాలని రావు రమేష్ తన రెమ్యునరేషన్ ని అమాంతం గా పెంచేసాడు. మొదట్లో తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న రావు రమేష్ ఈ మధ్య రెండు, మూడు సినిమాలలో బాగా పేరొచ్చే సరికి వచ్చినంత ఇప్పుడే దండుకోవాలని ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. అతను ఏకంగా రోజుకి 2.50 నుండి 3 లక్షల దాకా డిమాండ్ చేస్తున్నాడట. మరి అతని నటనకు మంచి పేరుంది కాబట్టి అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు పెద్ద నిర్మాతలు రెడీ అవుతున్నారని సమాచారం. మరి పెద్ద సినిమాలకు అంత రెమ్యునరేషన్ ఇవ్వొచ్చుగాని... చిన్న సినిమాల నిర్మాతల పరిస్థితి ఏమిటి? రెమ్యునరేషన్ పెంచవచ్చు కానీ...సినిమా బడ్జెట్ ని బట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటే బావుంటుందని..లేదా మూవీ రిలీజ్ తర్వాత నిర్మాతకు మంచిగా డబ్బులు వస్తే..మరికొంత ఇచ్చేలా ..సీనియర్ స్టార్స్..సహకరిస్తే బావుంటుందని చిన్న నిర్మాతలు అనుకుంటున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement