Advertisement

వెంకయ్య కూడా వెనకడుగు వేస్తున్నాడు!

Fri 27th May 2016 07:13 PM
venkayya naidu,bjp,somu verraju,tdp,special status  వెంకయ్య కూడా వెనకడుగు వేస్తున్నాడు!
వెంకయ్య కూడా వెనకడుగు వేస్తున్నాడు!
Advertisement

ఇంతకాలం బిజెపి నాయకులు, కేంద్రమంత్రులు, రాష్ట్ర బిజెపి నాయకులు ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని చెబుతున్నప్పటికీ విభజన సమయంలో ఏపీకి పదేళ్ల ప్రత్యేకహోదా కావాలని రాజ్యసభలో పట్టుబట్టిన వెంకయ్యనాయుడు మాత్రం మౌనంగానే ఉంటూ వచ్చారు. అయితే తాజాగా ఆయన కూడా ఏపీకి ప్రత్యేకహొదా అవసరం లేదని తేల్చేశాడు. ఏపీకి ప్రత్యేకహొదా విషయంలో తాను పట్టుబట్టిన మాట వాస్తవమే అని, కానీ 14వ ఆర్ధిక సంఘం మాత్రం ఏపీకి ప్రత్యేకహోదా కాకుండా ఇతర రూపాల్లో కావాల్సింత సాయం చేయమని తేల్చిచెప్పిందని ఆయన సెలవిచ్చారు. కాబట్టి కేంద్రం ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా చూస్తుందని, కావాల్సినంత సాయం చేస్తుందని ఆయన సెలవిచ్చాడు. ఇప్పటికే రాజధాని, పోలవరం, ప్రత్యేక రైల్వేజోన్‌, ఇతర ఆర్దిక విషయాల్లో కేంద్రం రాష్ట్రం అడిగిన దాని కన్నా ఎక్కువే సహాయం చేస్తోందని, కానీ దేనికైనా ఓ విధివిధానం ఉంటుందని, ఎప్పుడు పడితే అప్పుడు సాయం చేయలేమని, అలాగే రాష్ట్రం కోరినప్పుడల్లా తాము అంతంత సాయం చేయలేమని, తమ పద్దతి ప్రకారం దశల వారీగా సాయం చేస్తామని ఆయన తెలిపారు. 

ఏపీ రాజధానిని హైదరాబాద్‌, సింగపూర్‌లతో పోల్చడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. అసలు తమ రాజధానిని హైదరాబాద్‌తో పోల్చడం సమంజసం కాదని ఆయన తేల్చిచెప్పారు. హైదరాబాద్‌ తరహాలో ఒకే చోట అభివృధ్దిని కేంద్రీకరించడం బిజెపి సిద్దాంతం కాదని, అభివృధ్ది వికేంద్రీకరణ బిజెపి లక్ష్యమని ఆయన తేల్చిచెప్పారు. కాగా బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరో విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంకుడు గుంతల కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అని, ఐవైఆర్‌ కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో కేంద్రం ఇంకుడుగుంతల పథకం కోసం రాష్ట్రానికి రూ.900కోట్లు ఇచ్చిందని, ఒక్క గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలోనే రూ.9కోట్ల నిదులు విడుదలయ్యాయని, కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను సద్వినియోగం చేసుకోవడం లేదని విమర్శించారు. అయితే ఈ రెండు విషయాలలోనూ బిజెపినాయకులు చెబుతున్న మాటలపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు ఎన్నికల ప్రచార సభలో మోడీనే స్వయంగా ఏపీకి ఢిల్లీని మించిన స్దాయిలో రాజధానిని కడతామని మాట ఇచ్చారు. కానీ నేడు వెంకయ్య రాజధానిని హైదరాబాద్‌తో పొల్చడాన్ని తప్పుపడుతున్నారు. మరోవైపు దాదాపు 15ఏళ్ల కిందటే బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఆయన ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు ఆ పదకాన్ని కూడా బిజెపి తమ కార్యక్రమం అనిచెప్పుకోవడం ఏమిటనే? విమర్శలు వినిపిస్తున్నాయి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement