Advertisement

నాగార్జున సామాన్యుడు కాదు!

Sun 01st May 2016 02:22 PM
nagarjuna,tdp,telangana cm,amala akkineni,kcr,chandra babu naidu,blue cross  నాగార్జున సామాన్యుడు కాదు!
నాగార్జున సామాన్యుడు కాదు!
Advertisement

సినిమాల విషయంలోనే కాదు..  నిజజీవితంలో కూడా నాగ్‌ది పక్కా బిజినెస్‌ మైండ్‌.  ఆయన చేసే ప్రతి పని వెనుక ఏదో ఒక మతలబు ఉంటుంది. తన అన్నపూర్ణ ఏడెకరాల స్దలం విషయానికి వచ్చినప్పుడు ఆయన దాదాపు కేసీఆర్‌ను మాయ చేసి తన ఆస్తులను కాపాడుకున్నాడు. తనకు అవసరమైతే ఎవరి కాళ్లు పట్టుకోవడానికైనా నాగ్‌ సిద్దంగా ఉంటాడు. కానీ దానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రం ఆయన తప్పకుండా ఆశిస్తాడు. ఎన్నికలప్పుడు అదే పనిగా గుజరాత్‌ వెళ్లి మోడీని కలిసి మోడీ తనకు మంచి సన్నిహుతుడనే అంశాన్ని ఆయన తన ప్రత్యర్దులకు చేరవేశాడు. ఆఖరికి కేసీఆర్‌ వంటి మొండివాడిని కూడా తన వైపుకు తిప్పుకుని తన విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా నిలువరించగలిగాడు. మొత్తానికి నాగ్‌ పక్కా ప్రొఫెషనల్‌. కేసీఆర్‌తోనే కాదు ఇటు చంద్రబాబుతో కూడా ఆయన తనకు కావాల్సిన పనులు చేయించుకోగల దిట్ట. తాజాగా ఆయన తన శ్రీమతికి కూడా తెలంగాణకు సంబంధించిన ఓ కమిటీలో మెంబర్‌షిప్‌ ఇప్పించి కేసీఆర్‌ వద్ద తనకున్న పరిచయాన్ని అందరికీ పరోక్షంగా చాటిచెప్పాడు. తాజాగా తన శ్రీమతి అమలకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవాన్ని ఇచ్చేలా చేసుకున్నాడు. స్వతహాగా జంతు ప్రేమికురాలైన అమల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లూక్రాస్‌ సంస్ధ తరపున జంతు సంరక్షణ కోస కృషి చేస్తోంది. కాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ బోర్డ్‌లో అక్కినేని అమలకు స్దానం దక్కింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చైర్మన్‌గా నియమించిన ఈ బోర్డ్‌లో అక్కినేని అమలను సభ్యురాలిగా తీసుకున్నారు. కేసీఆర్‌ సూచన మేరకు మొత్తం 21మందితో జంతు సంరక్షణ బోర్డు ఏర్పాటైంది. దీనివల్ల ఆర్ధికంగా నాగ్‌కు, అమలకు వచ్చే ఆర్ధిక ప్రయోజనాలు ఏమీ లేకపోయినా తన టాలెంట్‌తో అమలకు ఆ పదవి దక్కేలా చేసిన నాగ్‌ ఘటికుడనే చెప్పాలి. నిజానికి బిజెపికి, టిడిపికి కలిసి గత ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్‌ కూడా ఆయా పరిచయాలను ఉపయోగించుకొని ఇప్పటికీ పెద్దగా లాభపడలేదు. దీనివల్ల పవన్‌కు మిత్రులు కంటే శత్రువులే ఎక్కువయ్యారు. కానీ నాగ్‌ మాత్రం శనగలు తిని చేయి కడుక్కున్న చందాన తన ప్రయోజనాలను తాను పొందుతున్నాడు అనేది వాస్తవం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement