Advertisement

మెగాస్టార్ కు సినీ మీడియానే గతి !!

Sat 30th Apr 2016 07:20 PM
chiranjeevi,cine media,political media,publicity,allu aravind  మెగాస్టార్ కు సినీ మీడియానే గతి !!
మెగాస్టార్ కు సినీ మీడియానే గతి !!
Advertisement

చిరంజీవి  స్టార్ నుండి మెగాస్టార్ స్థాయి వరకు ఎదిగిన క్రమంలో  చిరంజీవికి తోడుగా నిలిచింది సినీ మీడియానే. ఆయన ప్రతి మలుపులో సినీ మీడియా ఉంది. మెగాస్టార్ గా ఉన్నంత వరకు చిరంజీవి ఇమేజ్ ను అద్దాలమేడలో భద్రంగా కాపాడింది. చిరంజీవి నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సందర్భంలోను మీడియా విమర్శలకు తావులేకుండా చూసింది. అలాంటి మీడియాను చిరంజీవి ఒక సందర్భంలో పక్కన పెట్టేశారు. అదే ఆయన రాజకీయ అరంగేట్రం చేసినపుడు. అంతవరకు తన కుటుంబ మిత్రులు మీరంతా అని చెప్పిన ఆయన రాజకీయ ప్రవేశం చేయడంతోటే సినీ మీడియాను దరిదాపులకు రానియ్యలేదు. తనతో వ్యక్తిగత స్నేహం కూడా ఉన్న సినీ మీడియా కంటే పొలిటికల్ మీడియానే అవసరం అని భావించారు. భవిష్యత్తులో ప్రజారాజ్యం పార్టీ గెలిస్తే, తాను ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన పక్షంలో సినీ మీడియా చొరవ తీసుకుంటుందని ఆయన అనుమానించారు. కానీ సినీ మిడియా అనేది ఎప్పుడూ టాలెంట్ ను ప్రోత్సహించేది. కొత్తగా వచ్చేవారి సామాజిక వర్గం ఏమిటీ, ఏ ప్రాంతం వారు అనే విషయాలు పట్టించుకోదు. అందువల్లే ఇప్పటికీ కొత్త ఆర్టిస్టులతో తీస్తున్న సినిమా అయినా సరే కవరేజ్ లో ఎలాంటి వ్యత్యాసం చూపించదు. 

 ప్రస్తుతానికి వస్తే ఒకప్పుడు వద్దనుకున్న సినీ మీడియానే మెగాస్టార్ కు ఇప్పుడు అవసరం అయింది. రాజకీయంగా ఆయన ప్రాధాన్యత తగ్గింది. దాంతో పొలిటికల్ మిడియా చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించింది. రాజకీయంగా ప్రస్తుతం చిరంజీవి ఖాళీగానే ఉన్నారు. మెగాస్టార్ గా ఒకప్పుడు ఉన్న ఇమేజ్ ఇప్పుడు బాగా తగ్గింది. దాన్ని మళ్లీ పునరుద్దరించే పనులు బావమరిది అల్లు అరవింద్ నెత్తిన వేసుకున్నారు. అందుల భాగంగానే మళ్లీ నటించడం. చిరు కొత్తం చిత్రం గురించి చాలాకాలంగా ఊరించి ఊరించి చివరికి లాంఛనంగా మొదలెట్టారు. 

 చిరంజీవి నటుడిగా పునప్రారంభం కావడంతోటే ఆయనకు సినీ మీడియా అవసరం వచ్చింది. గతంలో దూరం పెట్టిన సినీ పాత్రికేయులే మళ్లీ అవసరం అయ్యారు. ఎనిమిదేళ్ళ విరామం తర్వాత చిరంజీవి నటిస్తున్నప్పటికీ పొలిటికల్ మీడియా ఆసక్తి చూపించలేదు. కేంద్రమంత్రిగా కూడా కొద్దికాలం పనిచేసి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్న చిరంజీవి మళ్లీ సినిమాలో నటించడం అంటే అది ప్రాధాన్యతలేని వార్తగానే పొలిటికల్ మీడియా భావించింది. కానీ సినీ మీడియా మాత్రం చిరంజీవి సినిమాకు  ఎప్పటిలాగే తగిన ప్రాధాన్యత ఇచ్చింది. దటీజ్ సినీ మీడియా.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement