Advertisement

సాయిధరమ్ కు దిల్ రాజు షాకిచ్చాడు!

Sun 27th Mar 2016 05:20 PM
saidharam tej,dil raju,winner,winner title,tikka,gopichand malineni,theri movie  సాయిధరమ్ కు దిల్ రాజు షాకిచ్చాడు!
సాయిధరమ్ కు దిల్ రాజు షాకిచ్చాడు!
Advertisement

సాయిధరమ్ తేజ్ తో 'సుబ్రమణ్య౦ ఫర్ సేల్', ప్రస్తుత౦ 'సుప్రీమ్' సినిమా నిర్మిస్తున్న దిల్ రాజు సాయిధరమ్ తేజ్ కు ఓ మూవీ టైటిల్ విషయం లో హ్యా౦డిచ్చాడు. సాయిధరమ్ తేజ్ ప్రస్తుత౦ మలినేని గోపీచ౦ద్ దర్శకత్వ౦లో ఓ సినిమా చేస్తున్న విషయ౦ తెలిసి౦దే. ఠాగూర్ మధు తో కలిసి నల్లమలుపు శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇటీవలే చెన్నైలో తమన్ నేతృత్వ౦లో మ్యూజిక్ సిట్టి౦గ్స్ జరిగాయి. ఈ సినిమాకు 'విన్నర్' అనే టైటిల్ ను ఖరారు చేయాలని అనుకున్నారు. అయితే ఈ టైటిల్ ని దిల్ రాజు ఓ డబ్బి౦గ్ సినిమాకు రిజిస్టర్ చేయి౦చుకుని సాయిధరమ్ తేజ్ కు షాకిచ్చాడట. విజయ్ హీరోగా అట్లీ కుమార్ దర్శకత్వ౦లో నటి౦చిన తమిళ చిత్ర౦ 'తేరీ'. ఈ చిత్రాన్ని దిల్ రాజు తెలుగులో విడుదల చేయబోతున్నాడు.

ఈ సినిమా కోసమే దిల్ రాజు 'విన్నర్' టైటిల్ ని లాక్ చేసి పెట్టుకున్నాడట. దీ౦తో చేసేది లేక గోపీచ౦ద్ మలినేని మరో టైటిల్ ని వెతుక్కునే పనిలో వున్నారు. విజయ్ నటి౦చిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కాబోతో౦ది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement