Advertisement

కొన్ని సినిమాలు కెలక్కూడదు భయ్యా!

Sat 06th Feb 2016 05:37 PM
speedunnodu,sundara pandian  కొన్ని సినిమాలు కెలక్కూడదు భయ్యా!
కొన్ని సినిమాలు కెలక్కూడదు భయ్యా!
Advertisement

ఇతర భాషల్లో, మరీ ముఖ్యంగా మన పక్కనే ఉండే తమిళ నాడు, కేరళలో హిట్టయిన సినిమా కథలని ఎంతో కొంత పెట్టి కొనేసి, ఇక్కడ రీమేక్ చేసేస్తే మినిమమ్ గ్యారంటీ ఉంటుందని నమ్మే నిర్మాతలకి మన దగ్గర కొదవే లేదు. ఈ కోవలోకి ముందుగా వచ్చేవారు నిర్మాత బెల్లంకొండ సురేష్ అండ్ దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు. ఇద్దరూ రీమేక్ స్పెషలిస్టులుగా పేరు పొందిన వాళ్ళే. అందుకే బెల్లంకొండ గారబ్బాయి సాయి శ్రీనివాస్ హీరోగా భీమనేని దర్శకత్వంలో నిన్నొచ్చిన స్పీడున్నోడు ప్యూర్ అరవ చిత్రం సుందర పాండియనుకి రీమేక్. కాకపోతే మన చిత్రానికి తేడా కొట్టేసింది ఏమిటంటే నేటివిటీ అండ్ పటిష్టమైన ట్రీట్మెంట్. సుందర పాండియన్ కథలోని ఆత్మను ఉన్నది ఉన్నట్టుగా వాడుకోవడంలోనూ, అక్కడ దొరికే రా ప్రెజెంటేషన్ మరియు సహజత్వాన్ని ఇనుమడింపజేసే పాత్రలు తెలుగులోకి అనువదించడంలోనూ పూర్తిగా దెబ్బ తిన్నారు. కొన్ని తమిళ చిత్రాలలోని ఫీల్ అండ్ సోల్ అలాగే ఉండాలంటే డబ్బింగ్ చేసి వదిలితే సరిపోతుంది. అలా కాదని అనవసర ప్రయత్నాలు చేసి కెలికితే ఫలితం బెడిసికొట్టడం ఖాయం. అక్కడి సుందర పాండియన్ ఇక్కడ తీస్తే చూస్తారా లేక ఇక్కడి సమరసింహా రెడ్డిలు, ఇంద్రలు అక్కడ తీస్తే చూస్తారా. అక్కడిది అక్కడే ఇక్కడిది ఇక్కడే.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement