ఆసియా ఖండంలో నీలాంటి గుంట లేదే

Sat 12th Dec 2015 04:31 PM
priyanka chopra,asia sexiest woman  ఆసియా ఖండంలో నీలాంటి గుంట లేదే
ఆసియా ఖండంలో నీలాంటి గుంట లేదే

అందాల పోటీలకు సంబంధించి ఏ న్యూస్ అయినా ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముడవుతుంది. అదే ఫారిన్ దేశాల్లో నిర్వహించే పోటీల్లోనో లేక కాంటెస్టులోనో మన భారతీయ వనితలు విజయం సాధిస్తే మనం మరింత గర్వించాల్సిందే కదా. ఇప్పుడు బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా ఆసియాలోనే అత్యంత శృంగార మహిళగా విజయం సాధించింది. లండన్‌ నగరానికి చెందిన ఈస్ట్రన్ ఐ అనే మ్యాగజైన్ ఏటా నిర్వహించే ఈ పోటీలో మరోసారి ప్రియాంక సత్తా చాటింది. గత నాలుగేళ్ల పోటీలలో ప్రియాంక చోప్రా మూడు సార్లు విజేతగా నిలవడం, అందంలో ఆమెకి ఆమే సాటి అని నిరూపించినట్టయింది. మొదటగా ఈ పోటీకి ఆసియా ఖండంలోని 50 మంది శృంగారవంతమైన మహిళలను ఎంచుకుని, వీరికి ఆన్‌ లైన్‌లో ఓటింగ్ ద్వారా నెటిజన్ల అభిప్రాయాలు సేకరిస్తారు. అలా ప్రియాంకకు ఫస్ట్ స్థానం, టీవీ నటి సనయా ఇరానీ, మరో టీవీ నటి దృష్టి ధామి, దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ వరసగా రెండు, మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచారు. సినిమా అవకాశాలు ఎలా ఉన్నా, మరో ఏడాది వరకు... ఆసియా ఖండంలో ప్రియాంక లాంటి గుంట లేదే... అని పాడుకోవచ్చు.