Advertisement

పాటలకే కోట్లు పెడుతున్నారు..!

Sat 03rd Oct 2015 10:14 AM
  పాటలకే కోట్లు పెడుతున్నారు..!
పాటలకే కోట్లు పెడుతున్నారు..!
Advertisement

తెలుగు సినిమా రేంజ్‌ బాగా పెరిగింది. పలు కార్పొరేట్‌ సంస్థలు సిని నిర్మాణంలోకి అడగుపెట్టాయి. ఇక బాహుబలి, శ్రీమంతుడు చిత్రాలతో టాలీవుడ్‌ రేంజ్‌ పీక్స్‌కి చేరింది. దీంతో స్టార్‌ హీరోలతో సినిమా అంటే దాదాపు 60 నుండి 70కోట్ల వరకు కూడ బడ్జెట్‌ పెట్టడానికి నిర్మాతలు సిద్దం అవుతున్నారు. కాగా టాలీవుడ్‌లోనే కాదు.. కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో కూడా సినిమాలకు భారీ బడ్జెట్‌ కేటాయిస్తున్నారు. కేవలం ఓ చిన్న సినిమాకు అయ్యే మొత్తం బడ్జెట్‌ను కేవలం ఒకే ఒక్క పాట కోసం కేటాయిస్తున్నారు. సినిమా చుపిస్త మావ, భలే భలే మగాడివోయ్‌ వంటి పలు చిన్న చిత్రాలు రూపొందిన బడ్జెట్‌ మొత్తం కలిపి ఓ సాంగ్‌కు కేటాయించేస్తున్నారు. బాలీవుడ్‌లో అయితే ఈమధ్య కొన్ని భారీ బడ్జెట్‌ చిత్రాల నిర్మాతలు ఒక్కోపాటకు ఐదు నుండి ఏడు కోట్లు కూడా పెడుతున్నారు. ఇక కోలీవుడ్‌లో వచ్చిన విజయ్‌ పులిలో ఆయన ఇంట్రడక్షన్‌ సాంగ్‌ కోసం ఏకంగా ఐదు కోట్లు ఖర్చుపెట్టారు. తాజాగా మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న బ్రహ్మొత్సవం నిర్మాతలైన పివిపి సంస్థ కేవలం ఓ పాట కోసం మూడుకోట్లకు పైగా కేటాయించారని సమాచారం. పెళ్లికి సంబంధించిన పాటగా వచ్చే దీని కోసం ఐదువేల మందితో హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ పాటను చిత్రీకరించినట్లు సమాచారం. పెండ్లి వేడుకకు సంబంధంగా వచ్చే పాట కావడంతో పలువురు జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో పాటు డాన్సర్లు, సెట్టింగ్‌లు.. ఇలా అన్నీ కలుపుకుంటే దాదాపు మూడుకోట్లకు పైగా బడ్జెట్‌ అయిందట. భాహుబలిలోని ధీవరా.. సాంగ్‌కు తగ్గకుండా ఇంత బడ్జెట్‌ పాటల కోసమే వెచ్చిస్తున్న నిర్మాతల గట్స్‌ చూసి ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో పెద్ద చర్చ జరగుతోంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement