Advertisement

బాలయ్య, ఎన్టీఆర్ ల మధ్య వార్ తప్పదా!

Fri 04th Sep 2015 05:22 AM
ntr,balakrishna,dictator,ma nannaku prematho  బాలయ్య, ఎన్టీఆర్ ల మధ్య వార్ తప్పదా!
బాలయ్య, ఎన్టీఆర్ ల మధ్య వార్ తప్పదా!
Advertisement

ఇప్పటివరకు సంక్రాంతి బరిలో బాబాయ్‌ బాలకృష్ణ, అబ్బాయ్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ల మధ్య పోటీ వచ్చే వాతావరణం ఏర్పడలేదు. గతంలో కూడా చాలాసార్లు అలా భావించినప్పటికీ చివరకు ఏదో ఒక సినిమా వెనక్కి తగ్గటం చూస్తూనే ఉన్నాం. కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం బాక్సాఫీస్‌ వద్ద బాలయ్య, ఎన్టీఆర్‌ల మధ్య పోటీ తప్పేట్లు లేదు. సినిమా ప్రారంభించిన రోజునే తమ చిత్రం జనవరి 8వ తేదీన వస్తుందని ఎన్టీఆర్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న నాన్నకు ప్రేమతో యూనిట్‌ డిక్లేర్‌ చేసింది. అదే సమయంలో ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం డిక్టేటర్‌ ను జనవరి 14న సంక్రాంతి రోజున విడుదల చేస్తామని యూనిట్‌ ప్రకటించింది. ఇందులో బాలయ్య సరసన అంజలి, సోనాల్‌చౌహాన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్‌ యాక్షన్‌ మూవీకి కోనవెంకట్‌, గోపీమోహన్‌లు రైటర్స్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌ సినిమాను బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, రిలయన్స్‌ సంస్థ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నాడు. బాలయ్య చిత్రాన్ని ఈరోస్‌ సంస్థతో కలిసి వేదాశ్వ క్రియేషన్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది.సో... ఈ సారి వ్యాపార శత్రువులైన ఈరోస్‌, రిలయన్స్‌ల మధ్య పోటీ కూడా తప్పేట్లు కనిపించడం లేదు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement