Advertisement

'అప్పా'పై మోజు పడుతోన్న వర్మ!

Tue 04th Aug 2015 05:31 AM
ram gopal varma,appa movie,bangalore don mutthaparoy  'అప్పా'పై మోజు పడుతోన్న వర్మ!
'అప్పా'పై మోజు పడుతోన్న వర్మ!
Advertisement

మాఫియా చిత్రాలతో తనకంటూ ఓ స్టైల్‌ని క్రియేట్‌ చేసుకున్న దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. తాజాగా ఆయన 'అప్పా' అనే కన్నడ చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు. బెంగుళూరు డాన్‌ అయిన ముత్తపరాయ్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదో మాఫియా డాన్‌ జీవితచరిత్ర కావడంతో ఈ చిత్రాన్ని ఆయన అండర్‌వరల్డ్‌ బాహుబలిగా అభివర్ణించారు. ఇంతకీ బెంగుళూరు మాఫియా డాన్‌గా ఎవరు నటించబోతున్నారు? అంటే కన్నడ హీరో కిచ్చా 'ఈగ' ఫేమ్‌ సుదీప్‌ ఇందులో టైటిల్‌ రోల్‌ చేయనున్నాడని సమాచారం. గతంలో సుదీప్‌-రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్‌లో 'పూంక్‌' చిత్రం వచ్చింది. కాగా ప్రస్తుతం 'అప్పా' ప్రీపొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి వర్మ 'ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ది గాడ్‌ ఫాదర్స్‌' అనే ట్యాగ్‌లైన్‌ పెట్టాడు. మరి ఈ చిత్రమైనా ఆయనకు మరలా పూర్వ వైభవాన్ని తిరిగి తెస్తుందో లేదో చూడాల్సివుంది...! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement