Advertisement

'శ్రీమంతుడు' స్పెషాలిటీ ఇదేనట!

Wed 29th Jul 2015 11:36 AM
mahesh babu,sreemanthudu,different looks,koratala siva  'శ్రీమంతుడు' స్పెషాలిటీ ఇదేనట!
'శ్రీమంతుడు' స్పెషాలిటీ ఇదేనట!
Advertisement

మహేష్‌బాబు, శృతిహాసన్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'శ్రీమంతుడు'. కాగా ఈ చిత్రం ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌రిలీజ్‌కు సిద్దమవుతోంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోలు ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం తెలిపింది చిత్రయూనిట్‌. ఈ చిత్రంలో మహేష్‌ డిఫరెంట్‌ డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తాడట. మొత్తంగా ఇలా ఏడు లుక్స్‌ ఉన్నాయట. ఇవి కావాలని ఇరికించినట్లుగా ఉండవనీ కథారీత్యానే ఈ వేరియేషన్స్‌ అవసరం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్‌కి స్టైలిష్ట్‌గా పనిచేసిన అక్షయ్‌త్యాగి ఈవిషయాన్ని వెల్లడించాడు. 'శ్రీమంతుడు'కి ఆ లుక్కులన్నీ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవబోతున్నాయని ఆయన అంటున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో బిజినెస్‌ మ్యాగ్నెట్‌గా, కాలేజీ కుర్రాడిలా, మాస్‌ హీరోగా ఉన్న లుక్స్‌ని చూపించారు. మరి ఆ మిగతా లుక్స్‌ చూడాలంటే ఆగష్టు 7వరకు ఆగాల్సిందే....! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement