Advertisement

బన్నీ, బోయపాటి చిత్రానికి ముహూర్తం...!

Wed 01st Jul 2015 04:37 AM
allu arjun,boyapati srinu,trivikram sreenu,legend movie  బన్నీ, బోయపాటి చిత్రానికి ముహూర్తం...!
బన్నీ, బోయపాటి చిత్రానికి ముహూర్తం...!
Advertisement
అల్లుఅర్జున్‌ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ వస్తోంది. కాగా ఈ చిత్రం జులై 17నుండి ప్రారంభం కానుందని తాజా సమాచారం. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వంటి ఫ్యామిలీ డైరెక్టర్‌ తర్వాత బోయపాటి శ్రీను వంటి మాస్‌ డైరెక్టర్‌తో బన్నీ చేయనుండటం, అందునా ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌ సంస్థ స్వయంగా నిర్మించనుండటం, ‘లెజెండ్‌’ వంటి సూపర్‌హిట్టు తర్వాత బోయపాటి సినిమా ఇదే కావడం... బోయపాటి గత చిత్రాలకు బిన్నంగా ఈ చిత్రం కేవలం యాక్షన్‌ అండ్‌ మాస్‌ అంశాలతోనే కాకుండా కామెడీ, ఫ్యామిలీ, లవ్‌ వంటి అంశాలతో తెరకెక్కనుండటం..  వంటి అనేక విశేషాలు ఈ చిత్రానికి వేదిక కానున్నాయి. కాగా ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించనుండగా, రెండో హీరోయిన్‌ కోసం అన్వేషణ కొనసాగుతోంది. 
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement